నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేవరకు వారికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు కడప రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ చమర్తి జగన్‌మోహన్‌రాజు. “ఉద్యోగ భద్రత ప్రతి ఇంటికి” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 405 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఎక్కువగా లోకల్ గానే ఉద్యోగ అవకాశాలు కావాలని అడుగుతున్నారని, ఇది సాధ్యం కావాలంటే గ్రామాల్లో కుటీర పరిశ్రమల అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో ఒక పరిశ్రమ కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవల ఇక్కడ పర్యటించిన ముఖ్యమంత్రి..ఒంటిమిట్ట కేంద్రంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ఆదేశించారన్నారు. పరిశ్రమల అభివృద్ధితోనే ఉద్యోగ భద్రత సాధ్యమని, స్థానికంగా చిన్న, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ సిటీ, TCL వంటి సంస్థలతో కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ..త్వరలో మహిళల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం..
59
previous post





Total views : 89123