తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తొలుత దిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న విజయ్.. అనంతరం ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయ్యాక ఆయన తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో.. తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇరువురు నేతలు కలిసిన సందర్భంగా తీసిన ఫొటోలను పీఎంవో ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసింది. ఇటీవల నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ‘అనైమంగళం’ రాగి శాసనాలను తిరిగి భారత్‌కు రప్పించడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మేకెదాటు డ్యామ్ వివాదం అంశంపైనా ప్రధానితో చర్చించినట్లు పేర్కొంది. తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేయడం, వేధించడం వంటి ఘటనలు పెరుగుతుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే 12 అరెస్టులు నమోదయ్యాయని, ప్రస్తుతం 58 మంది మత్స్యకారులు శ్రీలంక నిర్బంధంలో ఉన్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది. మత్స్యకారులను, వారి పడవలను తక్షణమే విడుదల చేయాలని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా అభ్యర్థించినట్లు పేర్కొంది.
తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని మోదీతో భేటీ..
57
previous post





Total views : 89125