తమ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలులోని వివిధ క్లస్టర్లలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ దేశం గర్వించదగ్గ నాయకుడని అన్నారు. ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయన్నారు. తెలుగు జాతి ఎన్టీఆర్‌ను ఎన్నటికి మర్చిపోదని కొనియాడారు. ఇక ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వంలో పేదలకు అన్నివిధాలా అండగా ఉంటున్నామన్నారు. పింఛన్ల పంపిణీ, తల్లికివందనం పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతాయన్నారు. అన్న క్యాంటిన్ ద్వారా పేదల కడుపు నింపుతున్నట్లు టీజీ భరత్ గుప్తా తెలిపారు.
కర్నూలులో వివిధ క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం..
52






Total views : 89056