Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Business చైల్డ్ సెక్స్ కంటెంటుపై మెటాకు కేంద్రం నోటీసులు.

చైల్డ్ సెక్స్ కంటెంటుపై మెటాకు కేంద్రం నోటీసులు.

by CVR NEWS

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ కు కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టి షాక్ ఇవ్వనుంది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా యూజర్ల భద్రతపై అసంతృప్తిగా ఉన్న కేంద్ర ఐటీ శాఖ.. మెటాకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రూపంలో ప్రమోట్ చేయడంపై కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి అభ్యంతరకరమైన ప్రకటనలను ఎలా అనుమతిస్తున్నారో వెంటనే వివరణ ఇవ్వాలని కోరుతూ మెటాకు నోటీసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి నుండి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, వాట్సాప్ కొత్తగా తీసుకురానున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై కూడా కేంద్రం ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ నంబర్ లేకుండా కేవలం యూజర్ నేమ్ ద్వారా చాట్ చేసుకునే ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల యూజర్ల భద్రతకు ముప్పు లేదని సరైన వివరణ ఇచ్చేంతవరకు.. దీన్ని దేశంలో లాంచ్ చేయవద్దని మెటాను ఆదేశించింది. దేశంలో డిజిటల్ భద్రత, ముఖ్యంగా చిన్నారుల రక్షణ, యూజర్ల డేటా ప్రైవసీ విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని తాజా పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చట్ట వ్యతిరేక కంటెంట్ విషయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: