Saturday, August 22, 2026
News Navigation
Saturday, August 22, 2026
News Navigation

Breaking

Saturday, August 22, 2026
Home Crime రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ.

రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ.

by CVR NEWS

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రూపారెడ్డి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో సంతాప సభ నిర్వహించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. రూపారెడ్డి హత్య ప్రతి ఒక్కరినీ కలచివేసిందన్నారు. హంతకులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల భద్రత కోసం టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు, డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండేలా కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: