Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home National వ్యాపార దిగ్గజం అదానీపై అమెరికాలో కేసు నమోదు

వ్యాపార దిగ్గజం అదానీపై అమెరికాలో కేసు నమోదు

by Rama
వ్యాపార దిగ్గజం అదానీపై అమెరికాలో కేసు నమోదు

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ల డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.
లంచం, మోసపూరిత కుట్ర కింద నేరారోపణలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చినట్టు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయని అధికారులు తెలిపారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమవడానికి ఒక కారణంగా ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై సెక్యూరిటీ ఫ్రాడ్, సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయాయి. అంతేకాదు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్టు తెలిపారు.అదానీలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ సీఈవో వినీత్ జైన్ తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని ‘న్యూమెరో యునో’, ‘బిగ్ మ్యాన్’ అనే కోడ్ పేర్లతో కుట్రదారులు అదానీ పేరుని ప్రైవేట్‌గా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్‌ఫోన్ ఉపయోగించారని అభియోగాల్లో పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..
    ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని, అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉబెర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్…
  • ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..
    ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగం దూసుకెళుతోందని, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్…
  • ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..
    విద్య వ్యాపారంగా మారింది. పిల్లల చదువులను పెట్టుబడిగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాయి విద్యాసంస్థలు. ఇంటర్నేషనల్‌, గ్లోబల్ అని బోర్డులు తగిలించుకుని… తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఉప్పల్‌ పీర్జాదీగూడలోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సంగతి సరిగ్గా ఇదే. పేరుకు ఇంటర్నేషనల్ స్కూలే…
  • అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..
    అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ.. వీఎంఆర్‌డీఏ, పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. పెదరాంబద్రపురం, నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో…
  • నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..
    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటికొస్తున్నాయి. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

012436
Total views : 75134

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.