Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్..

ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్..

by CVR NEWS
ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు కొనసాగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి కీలక అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ-గవర్నెన్స్, వేగవంతమైన పరిపాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగంగా పనిచేస్తున్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలను అభినందించారు. పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినప్పటికీ సరాసరి 10 గంటల వ్యవధిలో వాటిని డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌ను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు.ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందుతాయని సీఎం తెలిపారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌లో ఫైళ్ల క్లియరెన్స్ కీలక అంశమని పేర్కొన్నారు. సీఎస్, సెక్రటరీలు, హెచ్‌వోడీలు మొదలుకుని మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెరగాలని సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

023974
Total views : 143657

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.