303
శాశ్వత రాజధానితో ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రమేష్. రాజధాని కోసం కేంద్రం10 వేల కోట్ల రూపాయలిచ్చిందని..అలాగే ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారన్నారు. అమరావతి అంటే దేవతల రాజధాని అన్నారు సీఎం రమేష్. రాజధాని మహిళలు అమరావతి టూ తిరుమల కు పాదయాత్ర చేసారని..మూడు రాజధానులు అంటూ జగన్ నాటకాలు ఆడారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ బాగా పనిచేస్తుందని చెప్పారు.