Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home National దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర

దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర

by Satya
NIA

ఐసిస్ సానుభూతి పరులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా పలు కీలక నగరాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని వచ్చిన పక్కా సమాచారంతో నాలుగు రాష్ట్రాల్లోని 19 చోట్ల సోదాలు జరిపారు. ఈ సందర్భంగా 8 మంది సానుభూతి పరులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క కర్ణాటకలోనే మొత్తం 11 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తుండగా మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోనూ పలు చోట్ల దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మహారాష్ట్రలోని 40 చోట్ల అధికారులు సోదాలు చేసారు. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, నగదు, పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో బెల్లారి మాడ్యూల్ ఉగ్రవాద సంస్థ నేత మినాజ్ ఉన్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: