రాష్ట్రం లో అతి పెద్ద కార్పొరేషన్ గా జి వి ఎం సి అవతరించనుంది. ఇప్పటికే 98వార్డులు తో ఉన్న కార్పొరేషన్ ను 120వార్డులు గా పెంచేలా మున్సిపల్ పరిపాలన విభాగం కమిషనర్, డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గా 50వార్డుల తో ఏర్పడిన కార్పొరేషన్ మహా నగర పాలక సంస్థ గా 72వార్డు లు తో ఏర్పడి, ఆ తర్వాత 98వార్డులుగా ఇప్పుడు 120 వార్డులుగా దిన దినాభివృద్ధి చెందింది.. జనాభా ప్రాతి పాధికన వార్డు లు ఏర్పడనున్నాయి.. ఈ మేరకు 15లక్షలు పైగా జనాభా ఉన్న విశాఖ కార్పోరేషన్ ను 120 వార్డు లు గా పెంచనున్నారు.. దీనితో ఆశా వాహుల్లో ఆనందం నెలకొంది.. భీమిలి నియోజకవర్గం లో 64గ్రామాలను జి వి ఎం సి లో విలీనం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణన లోకి తీసుకుంది.. దీనితో అనకాపల్లి జిల్లా కశింకోట నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు కార్పొరేషన్ గా ఏర్పడనుంది.. దీనికి సంబంధించిన మరింత సమచారాన్ని విశాఖ నుండి మా ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు
రాష్ట్రం లో అతి పెద్ద కార్పొరేషన్ గా జి వి ఎం సి అవతరించనుంది..
218
previous post