Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Latest News మూసీ సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..

మూసీ సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..

by CVR NEWS

మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ డిస్మిస్ చేసింది. దీంతో మూసీ ప్రక్షాళన పనులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది. అయితే, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కార్తిక్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యూనల్ పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది. కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ట్రిబ్యూనల్ అభిప్రాపడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: