Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News కేరళలో రేవంత్‌ ఎన్నికల ప్రచారం..

కేరళలో రేవంత్‌ ఎన్నికల ప్రచారం..

by CVR NEWS

తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి, కేరళలో విజయన్‍కు పెద్ద తేడా లేదని, పదేళ్లలో అటు తెలంగాణను కేసీఆర్, ఇటు కేరళను విజయన్ భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిచారు. 2023 డిసెంబర్‍లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించామని, ఈ నెలలో కేరళలో కూడా పదేళ్ల పాటు ఉండేలా యూడీఎఫ్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. కేరళం పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ తన రెండోరోజు పర్యటనలో భాగంగా ఇవాళ కొచ్చిన్‍లో యూడీఎఫ్ కూటమి మేనిఫెస్టోను స్థానిక నేతలతో కలిసి విడుదల చేశారు. మొత్తం ఐదు గ్యారెంటీలతో ఈ మేనిఫెస్టోను రూపొందిచారు. ఈ సందర్భంగా కేరళం సీఎంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా కేరళం సీఎం పినరయి విజయన్‍కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజాపాలన నడుస్తోంది మా రాష్ట్రానిక వచ్చి ఆరు గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయో వచ్చి చూడాలని చాలెంజ్ చేశారు. తెలంగాణలో మేము పాలకులుగా కాకుండా సేవకులంగా పని చేస్తున్నామని ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు తెలిపారన్నారు. .

Advertisements

You may also like

Our Visitor

023356
Total views : 141819

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.