Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Health మెుక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు

మెుక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు

by Satya
Corn

మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ -ఇ, బి -1, బి -6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్ మరియు రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ ను అరికడుతుంది. ఎముకల బలానికి పోషకాలైన కాపర్ ఐరన్ ఇంకా అవసరమైన లవణాలు, మినరల్స్ అన్ని మెుక్కజొన్నలో పుష్కలంగా ఉన్నాయి. పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అధికం. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా మొక్కజొన్నలో ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో మొక్కజొన్నలు ఎంతగానో ఉపయోగపడతాయి. మెుక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమేకాదు. శరీరంపై ముడతలు రాకుండా చేస్తుంది. మెుక్కజొన్న గింజల నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే లినోలె యాసిడ్ చర్మ మంటలను, ర్యాష్‌లను తగ్గిస్తుంది.రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న ఒక అద్భుతమైన వరం. మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల వృద్ధి చేస్తుంది. మొక్కజొన్న రక్తకణాల్లో కొలెస్ట్రాల్ ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు పక్షవాతం బీపీ మొదలైన వాటి సమస్యలు అదుపులో ఉంచుతుంది.రోజూ మొక్కజొన్న తినేవారికి జుట్టు బలంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి జుట్టును స్మూత్‌గా, మంచి షైనింగ్‌గా ఉండేలా చేస్తుంది. మొక్కజొన్న తక్షణ శక్తిని ఇచ్చే ఆహారపదార్ధం. దీనిని తినడం వలన ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

Advertisements

You may also like

Our Visitor

008604
Total views : 56939

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.