Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Crime మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఆది శ్రీనివాస్..

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఆది శ్రీనివాస్..

by CVR NEWS
మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీరని విషాదం నెలకొంది. విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు మృత్యువాత పడటం జిల్లావ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకుంది.ఈ నేపథ్యంలో, మృతుల కుటుంబ సభ్యులను విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.అనంతరం, పుత్రశోకంలో ఉన్న బొల్లి రాజు మరియు బొల్లి రామ్మోహన్‌లను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఒకే కుటుంబంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

014989
Total views : 81438

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.