Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Latest News ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన..

ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన..

by CVR NEWS
ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఓటర్ల చైతన్యం మరోసారి స్పష్టంగా కనిపించిందన్నారు. పాలన నచ్చితే ప్రజలు మళ్లీ గెలిపిస్తారని, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారని ఈ ఫలితాలు చెబుతున్నాయని వ్యాఖ్యానించారు.తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని తెలిపారు. అస్సాం, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకున్న బీజేపీ.. పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకుందని పేర్కొన్నారు. ఈ విజయానికి పార్టీ అగ్రనాయకత్వం అకుంఠిత దీక్ష కారణమని కొనియాడారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితమే ఈ విజయమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా నాయకత్వానికి అభినందనలు తెలిపారు.ఇక తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మెజారిటీ రావడం విశేషమన్నారు. పార్టీ స్థాపించిన తక్కువ కాలంలోనే విజయ్ సాధించిన ఈ విజయాన్ని అభినందించారు. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి కూడా బలమైన పోరాటం ఇచ్చిందని పేర్కొన్నారు.

 

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012573
Total views : 75444

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.