246
రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో ఒకే విడతలో మూడు నెలల కోటా బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. నేటి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయనుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కిలలో బియ్యం ఇస్తారు. ఇక అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కిలోల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్‌ను పంపిణీ చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న భారీ ఆహార ధాన్యాల నిల్వలను తగ్గించడంతో పాటు, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరుకులను చేరవేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.