Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National Save Democracy : ఈ నెల 31న ఢిల్లీలో ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో భారీ ర్యాలీ..

Save Democracy : ఈ నెల 31న ఢిల్లీలో ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో భారీ ర్యాలీ..

by Satya
A huge rally in Delhi on 31st of this month with the slogan 'Save Democracy'


అరవింద్ కేజ్రీవాల్ కు నిరసనగా రాంలీలా మైదాన్‌లో మెగా మార్చ్:

లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ ప్రకటించింది. ‘సేవ్ డెమోక్రసీ(Save Democracy)’ నినాదంతో భారీ ర్యాలీ చేపడతామని ప్రతిపక్షాల నేతలు తెలిపారు. ఆదివారం ఆప్‌ నేతలతో కలిసి కాంగ్రెస్‌(Congress), సీపీఎం నేతలు సంయుక్త నిరసనలో పాల్గొన్నారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తీరుపై ప్రజల్లో చాలా ఆగ్రహం ఉందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్(Gopal Roy) అన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు దర్యాప్తు సంస్థలను ప్రధాని మోదీ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

కాగా, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ కూడా బీజేపీపై మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఎన్నికైన ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, పురాతన రాజకీయ పార్టీ ఖాతాలను స్వాధీనం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మా నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) యుద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదు అని అన్నారు. మరోవైపు మార్చి 31న ‘ఇండియా’ బ్లాక్‌కు చెందిన మిత్రపక్షాల నేతలు ఏకతాటిపైకి వస్తారని సీపీఎం నేత రాజీవ్ కున్వార్(Rajeev Kunwar) తెలిపారు. ప్రజాస్వామ్యంపై దాడులను తాము సహించబోమని అన్నారు.

ఇది చదవండి: కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే …
బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..
ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. …
పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008589
Total views : 56900

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.