వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం, ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో, విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా పురందేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారని అన్నారు.ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? అని పురందేశ్వరిని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో మీ నిజాయతీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలంటూ సవాల్ విసిరారు. మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర మీ కుటుంబ సభ్యులు ముడుపులు తీసుకున్నారని అన్నారు.హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారని, ఆ విల్లాకు సొమ్ము ఎవరు ఇస్తున్నారంటూ పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
Bjp
రాజేంద్రనగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైనందుకు రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు ఎంతగానో ఆసక్తిగా వస్తున్నారని ఆయన అన్నారు. రాజేంద్రనగర్ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటానని రానున్న కాలంలో బిఆర్ఎస్ పూర్తిస్థాయిలో కనుమరుగు చేయడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తానని రాజేంద్రనగర్ అభివృద్ధికి కీలక పాత్ర పోషించడమే కాకుండా గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసి పేద ప్రజలకు మెరుగైన వనరులతో పాటు విద్యావంతులని ప్రోత్సహించడంలో ఎంతగానో పాటు పడతానని అలాగే ఆయనకు బిజెపి అధిష్టానం నమ్మి ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో BJPకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ టికెట్ ఆశించారు,BJP పార్టీ విడుదల చేసిన మూడవ జాబితాలో తన పేరు లేకపోవడం తో మనస్తాపం చెంది నేడు ఒక ఫంక్షన్ హల్ లో అభిమానులు,ఆత్మీయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీని నమ్ముకొని నమ్ముకొని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, కానీ రాష్ట్ర పార్టీలోని పెద్దలు తనకు టికెట్ రాకుండా అడ్డుకొని తన సామాజికవర్గంకి చెందిన వ్యక్తికి టికెట్ ఇప్పించుకున్నారని పరోక్షంగా ఈటెల రాజేందర్ ని ఉద్దేశించి అన్నారు. అభిమానుల కోరిక మేరకు రెబెల్ అభ్యర్థిగా బరి ఉంటానని, సేవ కార్యక్రమాలు చెయ్యడం వల్ల నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారని వాళ్ళ ఆశీస్సులు తనమీద ఉంటాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు .
అలిపిరి పాదాల మండపం, పార్వేట మండపం పై బిజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. తిరుమలలో వైల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పార్వేట మండపాన్ని మరమ్మత్తు చేసే అవకాశం లేనందునే జీర్ణోధరణ చేసామని, అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణను బిజేపీ వ్యతిరేకించడం సమంజసం కాదు అన్నారు. పాదాల మండపం పురావస్తు శాఖ పరిధిలో లేదని గుర్తు చేసారు. ఇంజనీర్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించి…మరమ్మత్తులు అవకాశం లేదని తేల్చి చెప్పారు. 90శాతం స్తంభాలను వినియోగించే పాదాల మండలం పునరుద్ధరణ చేస్తాం అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా, సునితమైన ఆంశాలపై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలను అడ్డుకోవడం మంచి చర్య కాదు అని,మాజీ బోర్డు సభ్యుడిగా ఉండి భానుప్రకాష్ రెడ్డి కూడా టీటీడీపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. పార్వేట మండపం పరిశీలనకు బిజేపీ భానుప్రకాష్ ని నేను స్వాగతిస్తున్నా, మీడియా సమక్షంలో మండపం జీర్ణోధరణ పనులు పరిశీలించి నిజాలు భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు ఈఓ ధర్మరెడ్డి.
టిడిపి, బిజెపి, జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని, ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని ఆమే దర్శించుకున్నారు. ఆలయ మర్యాదులతో స్వాగతం పలికి స్వామి వారి దర్శిన బాగ్యం కల్పించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపట్టాన్ని అందజేసిన ఆలయ ఈవో వెంకటేశు. తరువాత అగరంపల్లిలో బిజెపి కార్యాలయం ను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలను కొనసాగుతుందని ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా…లిక్కర్, ఇసుక, మైనింగ్ లతో అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిజెపి లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం చెప్పలేక అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
ఇదివరకే పలు వివాదల్లో చిక్కుకున్న జీవితా రాజశేఖర్.. ఇప్పుడు పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అయితే అందుకు బదులుగా సమాధానమిస్తూ.. తనకు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్ అన్నారు. ప్రస్తుతం పలు మీడియాల్లో సర్క్యులేట్ అవుతోన్న తన ఫోటోలు పాతవేనని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు బీజేపీతోనే ఉన్నట్లు తెలిపారు. వ్యూహం అనే సినిమా రివ్యూ కమిటీకి వచ్చినప్పుడు అన్ని సినిమాల్లాగే దాన్నీ చూస్తానన్నారు. అయితే తనకు ఆఫీస్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ బలం రాహుల్ కు తెలియదని. తమ బలాన్ని చూసి ఇందిరాగాంధీనే సలాంకు వచ్చిందన్నారు. రాహుల్ గాంధీకి తామంటే ద్వేషంమని అన్నారు. రాహుల్ గాంధీ సహితులైన సింధియా, జితిన్ ప్రసాద్ వంటి పలువురు బిజెపిలోకి చేరారని. వారంతా డబ్బుల కోసమే బీజేపీలోకి వెళ్లారా అంటూ ప్రశ్నించారు. వారి పైన ఆరోపణలు చేయరు కానీ… తన పైన మాత్రం.. డబ్బుల కోసం పని చేస్తున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను అసదుద్దీన్ ఓవైసీ కావడం.. గడ్డం టోపీతో ఉండడటమే కారణమా అంటూ ప్రశ్నించారు.
ఇబ్రహీంపట్నం బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ అబ్దుల్లాపూర్మెట్ లోని గండి మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు మరియు బిజెపి శ్రేణులతో కలిసి తన ప్రచార దానికి కూడా పూజలు నిర్వహించారు. ప్రజలు ఈసారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బిజెపి పార్టీకి మద్దతు తెలుపుతున్నారని నోముల దయానంద్ గౌడ్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా వేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీ చేపట్టిన వివిధ పథకాలే ప్రజలు మా వైపు నడిచే విధంగా చేశాయని బిజెపి అభ్యర్థి దయానంద గౌడ్ తెలిపారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ భారతీయ జనతా పార్టీని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన బిజెపి నాయకులు మిగతా పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నా సమయంలో మా దుస్థితి చూసుకుంటుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. ఇంటింటికి వెళ్లి మా అభ్యర్థికి ఓటేయండి అని అడిగే సమయంలో అయ్యా మాకు టికెట్ కావాలి అని దీక్షలు చేయాల్సిన పరిస్థితి దుస్థితి మాకు కలిగింది. అంటే మా నాయకత్వం ఏం చేస్తుంది మా నాయకులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అసలు ఇంతవరకు కూడా ఏ రోజులో కూడా ప్రజా పోరాటంలో లేని వ్యక్తులు, ఇంతవరకు కూడా ఇక్కడున్న దుర్మార్గుడైన శాసనసభ్యున్ని ఎండగట్టని వ్యక్తులు మా పార్టీకి టికెట్ కావాలని అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన కేసులు పెడుతున్నారన్నారు పురందేశ్వరి. రాష్ట్రంలో నిరంకుశత పాలన నడుస్తోందని మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. మిగిలిన పొత్తులు సాధారణంగా ఎన్నికలు రెండు నెలలు ముందు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రాక్టర్లు పెద్దపెద్ద జేసీపీలతో నదుల్లో ఇసుక మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నిజమైన సామాజిక న్యాయం చేస్తున్నది ప్రజలకు సబకే సత్, సబ్కె వికాస్ ముందుకెళ్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు.





Total views : 90047