కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. జనాభాలో అధిక శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. అణగారిన వర్గాల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి మార్చుకోవాలని.. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గమంతా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా మా పార్టీకి మద్దతిస్తున్నారన్నారు. బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23, కాంగ్రెస్ 19 సీట్లే ఇచ్చాయన్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందు ప్రకటించమన్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్ఠానం కలిసి ఆ అభ్యర్థిని నిర్ణయిస్తారన్నారు. ఎవరు సీఎం అని ముందుగా ప్రకటించే సిస్టమ్ బీజేపీలో లేదన్నారు. ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తిని కాదన్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే చిత్తశుద్ధి గల కార్యకర్తను అని బండి సంజయ్ అన్నారు.
Bjp
ఎంపీ, కోరుట్ల BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్ TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు. నేటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ‘గొర్లు మింగేటోడు కేసీఆర్ అయితే.. బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి’ అని అన్నారు. కాంగ్రెసు ఓటేసి ఐదేళ్లు నాశనం చేసుకోవద్దన్నారు. ఎన్ని సీట్లు వచ్చినా ఏర్పడేది BJP ప్రభుత్వమేనని, తెలంగాణలో కాంగ్రెస్‌కు 35 నుంచి 40 సీట్లు దాటే ప్రసక్తే లేదని ఆయన జోష్యం చెప్పారు.
పెద్దల సభలో ఉంటూ చిల్లర వేషాలు వేస్తున్నారు ట్విట్టర్ రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి పై నిప్పులు చెరిగారు బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ట్విట్టర్ రెడ్డి విజయసాయి రెడ్డిపై 13 ఛార్జిషీట్ లు,
ఐపీసీ 120 (B), 409, 427 (A), మనీలాండరింగ్, అవినీతి కేసులలో విజయసాయి రెడ్డి A2 గా బెయిల్ మీద ఉన్నారని,జగతి పబ్లికేషన్స్ లో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడంలో విజయసాయి రెడ్డి కింగ్ పిన్ అని సిబిఐ పిటిషన్ వేసిన విషయాన్ని మరిచావా విజయసారెడ్డి అని ప్రశ్నించారు. బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డి కూడా విమర్శలు చేయడమా అంటూ ఎద్దేవా చేసారు.ఏ1, ఏ2 లు ఇద్దరికి త్వరలో బెయిల్ రద్దు కావడం ఖాయమని,సిఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరూ త్వరలో చర్లపల్లి జైలుకు వెళతారు అంటు తీవ్రస్థాయిలో ఆరోపించారు బిజెపి అధికార ప్రతినిధి శ్రీనివాస్.ప్రతి శుక్రవారం హాజరు కావాల్సి ఉన్నా 3000 సార్లుకు పైగా కోర్టుకు డుమ్మా కొట్టంది మీ ముఖ్యమంత్రి కాదా అంటూ ప్రశ్నించారు.మద్యం అమ్మకాల్లో డిజిటల్ విధానం ఎందుకు అమలు చేయరు అంటూ సూటిగా ప్రశ్నించారు బిజెపి అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్. కచ్చితంగా రాబోవు రోజుల్లో వీరంతా జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. శనివారం కవార్ధాలో బీజేపీ నిర్వహించిన ప్రచార సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. యూపీలో లవ్ జిహాద్ పూర్తిగా నిషేధంచామన్నారు. దీనికి వ్యతిరేకంగా చట్టం చేశామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కూడా లవ్ జిహాద్, గోవుల అక్రమ రవాణా, మైనింగ్ మాఫియాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్‌ను ఇంటికి పంపి..బీజేపీని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుందన్నారు.
ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆమె ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగారని, చంద్రబాబు పార్టీ నుంచి గెంటేస్తే కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. తన తండ్రిని అవమానించిన పార్టీ అంటూ అప్పటి వరకూ విమర్శించిన అదే కాంగ్రెస్ లో చేరి, నిస్సిగ్గుగా పదవులు చేపట్టారని అన్నారు. తండ్రిని అవమానించి, ఆ పునాదులపై ఏర్పాటైన టీడీపీలో అధికారం ఉన్నంతకాలం ఉన్న నీతిలేని చరిత్ర ఆమెదని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన మహా గొప్ప మహిళ అని పురంధేశ్వరిపై మండిపడ్డారు.
Read Also..
Read Also..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో ఆదివారం తదుపరి ఉమ్మడి కార్యచరణను ప్రకటించనున్నారని సమాచారం. పొత్తుకు సంబంధించి శనివారం రాత్రి జనసేనాని పవన్ కల్యాణ్ నివాసంలో కీలక చర్చలు జరిగాయి. ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థుల విజయానికి ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జనసేన ఏయే నియోజకవర్గల్లో పోటీ చేయనుందనే అంశంతోపాటు తదుపరి కార్యాచరణను ఆదివారం వెల్లడించనున్నారని సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7న తెలంగాణకు వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకావాలని కోరగా పవన్‌కల్యాణ్ సానుకూలంగా స్పందించారని బీజేపీ వెల్లడించింది.ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ గతంలో అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించిందని, ఈ ఎన్నికల్లో జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలావుండగా జనసేన 9 స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఏయే స్థానాల్లో బరిలోకి దిగబోతోందనేది త్వరలోనే వెల్లడికానుంది. మరోవైపు బీజేపీ ఇప్పటికే ఇప్పటికే 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు 9 నియోజకవర్గాలను మినహాయించగా ఇంకా 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
గోషామహల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రాజా సింగ్ దూల్పేట్ లోని ఆకాశపురి దేవాలయం వద్ద పూజ అనంతరం తన అభిమానులు మరియు కార్యకర్తలతో కలిసి లోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బైక్ ర్యాలీ గా బయలుదేరారు. ఆయనతోపాటు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఉదయం అబిడ్స్ లోనే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు అనంతరం రెండవసారి అభిమానులతో అబిడ్స్ కు బయలుదేరారు.
Read Also..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. లక్ష్మణ్, ఈటల, రఘునందనరావు తదితర బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతో తాము ఇప్పుడు ప్రాజెక్టును సందర్శించామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, విధానాలపై తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ వద్ద కుంగిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చూశాక మాట్లాడాలనే ఉద్దేశ్యంతో తాము ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నామన్నారు. కాగా, బీజేపీ నేతలు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు.
జనగామ జిల్లా జనగామ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరుట్ల దేశమంతా రెడ్డి ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేశారు. ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆరుట్ల ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు మంగళ హారతుల తోటి స్వాగతం పలుకుతున్నారు. కాగా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇక్కడి ఒటర్లు స్థానికేతరుడు వద్దు స్థానికుడే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానికుడు కాకపోవడం వలన జనగామ అభివృద్ధి చెందలేదన్నారు. జనగామ అభివృద్ధి చెందాలి అంటే బిజెపి పార్టీ అభ్యర్థి అయిన తనకు ఓటు వేయాలని కోరారు
జనగామ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరుట్ల దేశమంతా రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు వారు ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు మంగళ హారతుల తోటి స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. డబ్బులు ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలు స్థానికేతుడు వద్దు స్థానికుడే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానికుడు కాకపోవడం వలన జనగామ అభివృద్ధి చెందలేదని జనగామ అభివృద్ధి చెందాలి అంటే బిజెపి పార్టీ అభ్యర్థి అయిన తనకు ఓటు వేయాలని కోరారు.




Total views : 90087