రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని సీఐడీని ఆదేశించింది. మరోవైపు వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ… స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని… ఆ గడువు ముగిసేంత వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబోమని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు… అరెస్ట్ చేయవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.
Bjp
అభ్యర్థుల జాబితా ప్రకటనలో బాగా వెనకబడిన తెలంగాణ బీజేపీ తాజాగా నాలుగో జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో తాజా జాబితాను విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ప్రకటించిన మూడో జాబితాలో 35 మందికి చోటు కల్పించగా, తాజా జాబితాలో మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు వీరే బీజేపీ ప్రకటించిన తాజా జాబితా ప్రకారం.. చెన్నూరు నుంచి దుర్గం అశోక్, ఎల్లారెడ్డి నుంచి సుభాష్‌రెడ్డి, వేములవాడ నుంచి తుల ఉమ, హుస్నాబాద్ నుంచి శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్ నుంచి నవీన్‌కుమార్, కొడంగల్ నుంచి బంటు రమేశ్‌కుమార్, గద్వాల నుంచి బోయ శివ, మిర్యాలగూడ నుంచి సాదినేని శ్రీనివాస్, మునుగోడు నుంచి చలమల కృష్ణారెడ్డి, నకిరేకల్ నుంచి మొగులయ్య, ములుగు నుంచి అజ్మీర ప్రహ్లాద్ నాయక్ బరిలోకి దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుట్టపర్తిలో పురందేశ్వరి అధ్యక్షతన పోలింగ్ బూత్ మరియు శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది. పురందేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు విధానపరమైన లోపాలను ఎత్తిచూపితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి కోవర్టు అంటారా అంటూ ప్రశ్నించారు .రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే
ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. నిరుపేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 18 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఎన్ని ఇళ్లు నిర్మించారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం బిజెపి జనసేన పార్టీ పొత్తులో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు.
‘‘బిడ్డా… మాకోసం పోరాడుతున్నం. ధర్మం కోసం యుద్దం చేస్తున్నవ్. నువ్వు నిండు నూరేళ్లు సల్లగుండాలే. మా ఇంటి ఓట్లే కాదు… ఈ వాడల ఉన్న ఓట్లన్నీ పువ్వు గుర్తుకే వేయిస్తా.’’ బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ను ఉద్దేశించి రాజేశ్వరి అనే 65 ఏళ్లు వ్రుద్దురాలు అన్న మాటలివి. ‘‘బిడ్డా… మా పేదోళ్ల కోసం పాదయాత్ర చేసి అండగా ఉన్నవ్. మా కోసం కొట్లాడి జైలుకు పోయినవ్. నువ్వు యుద్ద వీరుడివి. నీకు కాకుండా ఇంకెవరికి ఓట్లేస్తం బిడ్డా… ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు సల్లగుండాలే. మా కోసం కొట్లాడతనే ఉండాలే’’ అంటూ సుశీల అనే 70 ఏళ్లు వ్రుద్ధురాలు బండి సంజయ్ కు వీర తిలకం దిద్ది శీస్సులిచ్చారు. వీళ్లే కాదు…. తొలిరోజు కరీంనగర్ లోని 24, 25 డివిజన్లలోని అంబేద్కర్ నగర్, కిసాన్ నగర్ లలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను కలిసిన ప్రతి ఒక్కరి నోటి నుండి ఇవే మాటలు వెలువడుతున్నయ్. ప్రతి ఒక్కరూ ఎదురొచ్చి ఈసారి పువ్వు గుర్తుకే మా ఓటు అంటూ నినదిస్తున్నారు. తొలిరోజు పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ వెళ్లిన ప్రతిచోట బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లి కొందరు, వీర తిలకం దిద్ది మరికొందరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘‘సంజయ్… నువ్వు ఎవరికీ తలొంచకు. మీ వెంట మేమున్నాం.’’ భరోసా ఇస్తున్నారు.
ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేడు సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సమావేశం అనంతరం ప్రధాని తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీసీ గర్జన సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బీజేపీ కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. సభ ఏర్పాట్లను పార్టీ ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. ఎజెండాతోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న బీసీ ఓట్లను దక్కించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, అయితే మరే ఇతర పార్టీ వారికి రాజ్యాధికారం ఇవ్వదనే కోణంలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కడం బీజేపీతోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో తెలంగాణలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని ప్రకటించారు. బీసీ సీఎం విషయంలో బీజేపీ నేతలు ప్రచార అస్త్రంగా వాడి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్నారు. బీసీ గర్జన సభలో ప్రధాని మోడీ ప్రకటించి బీసీ డిక్లరేషన్‌లో ఎలాంటి అంశాలు, హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
నిన్నటి ర్యాలీ ఒక చరిత్ర సృష్టించినది.స్వచ్ఛందంగా తరలివచ్చారు. 30 తేదిన విజయానికి సంకేతం. రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ లో బిజేపి గెలుస్తదని డిసైడ్ చేసాడు. బండిసంజయ్ భూదందాలు చేయలేదు. ఖబ్జాలు చేయలేదు. కరీంనగర్ అభివృద్ధి కి నిధులు తిసుకువచ్చింది ఎవరు, అభివృద్ధి అడ్డం పడ్డది ఎవరూ బండిసంజయ్ ని అసెంబ్లీ లో అడుగు పెట్టవద్దంటూ వేల కొట్లు కరీంనగర్ కి పంపుతున్నారు. కరీంనగర్ బండిసంజయ్ మీద ఎవరూ పోటి చెయడానికి ముందుకు రాకపోతే గుడ్డిలో మెల్లలాగా గంగులకి టికెట్ ఇచ్చారు. కెటిఆర్ ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే కుక్కలు కుడా దేకవు. కెటిఆర్ వి అహంకారం అహంకారం మాటలు. బిఆర్ఎస్ గెలిస్తే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తానని ఇప్పుడు ఇస్తానంటున్నారు. టిఎస్ పిఎస్సి సమస్య చిన్నది అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తరువాత నిరుద్యోగుల అశలు అడియాశలు అయినవి. నిరుద్యోగ సమస్యల కొసం బిజేపి పొరాటం చేస్తే జైలుకు పంపారు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరం లో మోడి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. యాభై లక్షల మంది నిరుద్యోగ యువత కదలి వచ్చి బిఆర్ఎస్ పార్టీని ఒడగొట్టడానికి చెతులు కలపాలి. నరేంద్ర మోడి బిసి అత్మగౌరవ సభకి వస్తున్నారు, బిసి వర్గానికి చెందిన వ్యక్తి ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాం. కెసిఆర్ కి బిసి ముఖ్యమంత్రి ని చెస్తానని చెప్పె దమ్ము ధైర్యం ఉందా? గతంలో చెప్పినట్లు ఎస్సిని ముఖ్యమంత్రిగా చేస్తావా. బంగారు తెలంగాణ అని బర్బాజ్ చేసాడు. కెసిఆర్ కుటుంబం అహంకారానికి, తెలంగాణ ప్రజలకి జరుగుతున్న పోరాటం. కెసిఆర్ రాజ్యాంగం కావాలా… అంబేద్కర్ రాజ్యాంగం కావాలా తెలంగాణ రాష్ట్రం లో దొంగలంతా బిఆర్ఎస్ లో చేరినారు. ఒకసారి బిజేపి పార్టీకి అవకాశం ఇవ్వండి. ప్రశ్నించే గొంతుని అణచివెయకండి….గెలిపించండి.
గోషామహాల్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో మంగళ్‌హట్ పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు. విధ్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు ఆయనకు జారీ చేశారు. కాగా తుపాకులు, కత్తులు ప్రదర్శించి రాజా సింగ్ పూజలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16న రాజా సింగ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో విధ్వేషపూరిత ప్రసంగం ఉందని పోలీసులు పేర్కొన్నారు. నవరాత్రి దాండియా కార్యక్రమాలు, వేడుకలకు ముస్లింలను అనుమతించవద్దని నిర్వహకులను రాజాసింగ్ కోరారు. అంతేకాదు కార్యక్రమానికి హాజరైన వారందరి గుర్తింపు కార్డులను పరిశీలించాలని, ఈవెంట్ కోసం ముస్లిం బౌన్సర్లు, వీడియోగ్రాఫర్లు, డీజే నిర్వాహకులు లేదా ఇతర వ్యక్తులను నియమించుకోవద్దని వీడియోలో కోరారు. ఈ వీడియోపై స్థానిక లీడర్ ఎంఏ సమద్ వార్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా పురంధేశ్వరి మారారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలై ఉండీ టీడీపీకి సేవ చేస్తున్నారని దుయ్యబట్టారు. పురంధేశ్వరి, ఆమె భర్త చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకు చెందిన ‘అన్న టీడీపీ’కి కొంత కాలం గౌరవ అధ్యక్షురాలిగా ఉండి ఆ పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక కాంగ్రెస్‌లో చేరారంటూ మండిపడ్డారు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి.. పురంధేశ్వరి అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకో వైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికమని సాయిరెడ్డి అన్నారు. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అంటకాగిందని ఆరోపించారు.
కేసీఆర్‌ను మించిన మోసగాడు..రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అర్వింద్.
కేసీఆర్ మీద కల్వకుంట్ల కుటుంబం మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఒక్కసారిగా మాట మార్చారు. కేసీఆర్ మంచోడే అంటూ ఆశ్చర్యపోయే కామెంట్లు చేశారు. అది కూడా రేవంత్ రెడ్డితో పోల్చుతూ.. ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మాట్లాడిన అర్వింద్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావటం అసంభవమని.. బీజేపీకే స్పష్టమైన మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేకపోతే హంగ్ వచ్చే అవకాశం ఉందని.. అలా జరిగితే అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మపురి అర్వింద్.
ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు అర్వింద్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి.. కేసీఆర్‌ను మించిన మోసగాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోల్చితే కేసీఆరే మంచోడంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని మించిన మోసగాడు ఎవరూ లేరన్నారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డ వెళ్తే మేడిగడ్డలో పిల్లర్లు మునిగిపోతాయంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని త్వరలోనే బయటపెడతానని చెప్పుకొచ్చారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను చేసిన పోరాటాలు, కేంద్రం నుండి తీసుకొచ్చిన ప్రస్తావిస్తూ రూపొందించిన కరపత్రం ప్రజలను ఆకర్షిస్తోంది. ‘‘నేనెప్పుడూ మీ బిడ్డనే… నిండు మనసుతో దీవించండి’’ పేరుతో రూపొందించిన 2 పేజీల కరపత్రాలను బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ‘‘నేనెప్పుడూ మీ బిడ్డను… మీ కళ్ల ముందు పెరిగిన. మీ కాళ్ల మధ్యన తిరిగిన. మీ దీవెనలతోనే ఇంతటి వాడినయ్యా. కరీంనగర్ గల్లీలో తిరిగిన సామాన్యుడిని దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశాన్ని కల్పించారు. పోరాటాల, చైతన్యాల కరీంనగర్ గడ్డపై పుట్టిన బిడ్డగా దేశం కోసం, ధర్మం కోసం కాషాయ జెండా పట్టుకుని ప్రజల పక్షాన పోరాడిన’’ అంటూ కరపత్రాన్ని రూపొందించారు. అంతేగాకుండా ఎంపీగా గెలిపించాక కరీంనగర్ అభివ్రుద్ధి కోసం చేసిన కార్యక్రమాలు, తెచ్చిన నిధులతోపాటు తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల పక్షాన చేసిన పోరాటాలను, జైలుకు వెళ్లిన సందర్భాలను కరపత్రంలో ప్రస్తావించారు. కరపత్రంపై ప్రజల్లో సానకూల చర్చ జరుగుతోంది





Total views : 90260