Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది: విజయసాయి రెడ్డి

నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది: విజయసాయి రెడ్డి

by Prakash
vijay saireddy comments on purandeswari

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా పురంధేశ్వరి మారారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలై ఉండీ టీడీపీకి సేవ చేస్తున్నారని దుయ్యబట్టారు. పురంధేశ్వరి, ఆమె భర్త చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకు చెందిన ‘అన్న టీడీపీ’కి కొంత కాలం గౌరవ అధ్యక్షురాలిగా ఉండి ఆ పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక కాంగ్రెస్‌లో చేరారంటూ మండిపడ్డారు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి.. పురంధేశ్వరి అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకో వైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికమని సాయిరెడ్డి అన్నారు. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అంటకాగిందని ఆరోపించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: