Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Telangana రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో..

రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో..

by Satya
Raja Singh

గోషామహాల్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో మంగళ్‌హట్ పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు. విధ్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు ఆయనకు జారీ చేశారు. కాగా తుపాకులు, కత్తులు ప్రదర్శించి రాజా సింగ్ పూజలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16న రాజా సింగ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో విధ్వేషపూరిత ప్రసంగం ఉందని పోలీసులు పేర్కొన్నారు. నవరాత్రి దాండియా కార్యక్రమాలు, వేడుకలకు ముస్లింలను అనుమతించవద్దని నిర్వహకులను రాజాసింగ్ కోరారు. అంతేకాదు కార్యక్రమానికి హాజరైన వారందరి గుర్తింపు కార్డులను పరిశీలించాలని, ఈవెంట్ కోసం ముస్లిం బౌన్సర్లు, వీడియోగ్రాఫర్లు, డీజే నిర్వాహకులు లేదా ఇతర వ్యక్తులను నియమించుకోవద్దని వీడియోలో కోరారు. ఈ వీడియోపై స్థానిక లీడర్ ఎంఏ సమద్ వార్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Advertisements

You may also like

Our Visitor

039792
Total views : 200841

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: