స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము ముందు నుంచి తప్పుపడుతున్నామని… నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండానే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని విమర్శించారు. బాబుకు బెయిల్ రావడం మంచి పరిణామమని చెప్పారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ, ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా జేబులు నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని దుయ్యబట్టారు.
Bjp
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు కార్పొరేటర్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన, 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవితోపాటు యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి సతీష్ లను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. తక్షణమే ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా నాయకులు తమ వ్యవహారశైలిపట్ల వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి ర్యాలీ నిర్వహించి ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి ఆచారి కోరడం జరిగింది నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో మొదట పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అన్ని పార్టీలకు అవకాశం కల్పించారు బిజెపి పార్టీ కూడా ఒక్కసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధి పథకంలో తీసుకు వెళ్తానని కేంద్రంలో తప్పనిసరిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని తనను గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తానని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు కల్వకుర్తి పట్టణంలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా వేడుకున్నారు పలువురు బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ఎన్నికలు దగ్గరపడటంతో ప్రధాన పార్టీలన్నీ త్వరితగతిన పావులు కదుపుతూ.. రాజకీయ సమీకరణాలలో దూకుడు పెంచాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఓల్డ్‌సిటీకి వెళ్లాలంటే అసదుద్దీన్ అనుమతి తీసుకొని పర్యటించాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. మజ్లిస్ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు సైతం కట్టరన్నారు. ఓల్డ్‌సిటీలో ఎంఐఎం చేస్తున్నది తప్పు అని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారని.. అటువంటి దౌర్బాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటం హేయనీయమన్నారు.
తెలంగాణ బీజేపీ అగ్రనేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు బెదిరింపులు వచ్చేవని ఆయన తెలిపారు. చార్మినార్ వద్ద బీజేపీ సభ పెడితే తన భార్య తలను నరికి బహుమతిగా పంపిస్తామని, కొడుకులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని చెప్పారు. అయితే బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా పాతబస్తీలో సభను నిర్వహించామని తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో బీజేపీని బలోపేతం చేయడానికి ధైర్యంగా పాతబస్తీలో సభను పెట్టామని చెప్పారు. బెదిరింపులకు భయపడకుండా చార్మినార్ ఎదుటే సభను నిర్వహించామని తెలిపారు. పార్టీ కోసం తెగించి, ధైర్యంగా ముందుకు వెళ్లిన చరిత్ర తమదని అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కూడా తన మాదిరే ఎన్నో బెదిరింపులు వచ్చాయని. ఆయనను చంపేస్తామని బెదిరించారని సంజయ్ తెలిపారు. అయినా, రాజాసింగ్ భయపడకుండా హిందూ ధర్మం కోసం తన పోరాటాన్ని కొనసాగించారని చెప్పారు. బీజేపీకి ఏడాది పాటు దూరమైనా. ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నారని కితాబిచ్చారు. బీజేపీ గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. బీజేపీ గెలిస్తే బీసీ నేత సీఎం అవుతారని అన్నారు. ఇప్పటికే బీజేపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లారని. ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలను నిర్వహిస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే, ఎన్నికల ఫలితాల మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తుందన్నారు. హంగ్‌కు ఎలాంటి ఆస్కారం లేదన్నారు. 2018లోనూ ఇలాగే చేశారన్నారు. కేంద్రమంత్రి అమిత్ షా బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం కేవలం ఎన్నికల గిమ్మిక్కు అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి డీల్ లేదన్నారు. చంద్రబాబు అరెస్టుపై మీ సమాధానం ఏమిటి? అని ఓ నెటిజన్ అడగగా.. ఈ వయస్సులో ఆయనకు అలా జరగడం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబం పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. వారి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత సానుభూతి తెలిపారు.
బీజేపీ నేత బాబు మోహన్ ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. తనకు మొదటి లిస్ట్ లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో పార్టీ తీరు పై మండిపడ్డారు. పార్టీ అధ్యక్షులకి ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. పార్టీ తన విషయంలో ఇచ్చే స్పందనను బట్టి పార్టీలో ఉండాలా లేదా అని భవిష్యత్ లో తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. సోషల్ మీడియాలో నా కొడుకుకి, నాకు మధ్య టికెట్ కోసం పోటీ నెలకొందని తప్పుడు ప్రచారం జరుగుతోందని మీడియాపై మండిపడ్డారు.
అన్నపూర్ణగా వున్న ఆంధ్రా రాష్ట్రాన్ని అరాచక ఆంధ్ర గా మార్చారని, జగన్ ను వెంకటేశ్వర స్వామి తో పోల్చడం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. కొండపై రాజకీయాలు మాట్లాడటం వైసిపి నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తిరుమలలో మార్గాని భరత్ మాటలను ఖండిస్తున్నామని.. ప్రజలకు మార్గాని భరత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మునుగోడు సీటును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటాయించటంపై కాంగ్రెస్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాలో మునుగోడు సీటును కేటాయించింది. మునుగోడు సీటు రాజగోపాల్ రెడ్డికి కేటాయించడాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు నిరసనగా రాజగోపాల్ రెడ్డి అమర్ రహే అంటూ దిష్టిబొమ్మని తగులపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీని కష్టకాలంలో వదిలేసి ఎన్నికల సమయంలో తిరిగి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎదగనివ్వలేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. సూర్యాపేట జనగర్జన బహిరంగ సభలో అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని సభలో ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు ఇది సువర్ణ అవకాశంగా లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మేధావులు, వివిధ సంఘాల నాయకులు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు.





Total views : 90017