టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. వారి రాజీనామాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకొని చైర్మన్ జనార్దన్ రెడ్డి తో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్, సభ్యుల కోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో జనార్దన్ రెడ్డి ఆ సమయంలోనే రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం మారడంతో గత డిసెంబర్లో ఆయన మళ్లీ రాజీనామాను సమర్పించారు. తాజాగా గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు.
BRS Govt
అంకెల గారడీతో తొమ్మిదేళ్ల పాటు ప్రజలను మోసం చేశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉందో చెప్పడానికే శ్వేతపత్రం విడుదల చేసినట్లు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలతో ముందుకు రావాలని తాము విపక్షాలను కోరుతున్నామన్నారు. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లడంపై సభలో చర్చిద్దామని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో వాస్తవాలకు దూరంగా బడ్జెట్ రూపకల్పనలు చేసిందని ఆరోపించారు. వారి పాలనలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు చేసిన ఖర్చుకు మధ్య అంతరం చాలా ఉందన్నారు. ఇలా అంకెల గారడీతో తొమ్మిదేళ్లు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
Read Also..
Read Also..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్ ముందు ఎర్రటి ఎండలో గద్దరన్న నిలబడినప్పటికీ ఆయనను అందులోకి అనుమతించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. ప్రగతి భవన్ ముందు కంచెలను బద్దలుకొట్టి ప్రజావాణిలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వింటుంటే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. నాడు హోం మంత్రికే ప్రగతి భవన్ లోకి అనుమతివ్వలేదు. మంత్రి ఈటల రాజేందర్ కు అనుమతి ఇవ్వలేదు. అందుకే గేట్లను బద్దలుకొట్టి ప్రజా భవన్ చేశాం. మాది ప్రజా ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తామన్నారు.





Total views : 147294