ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనంగా వుంటాడో ఆ జాతకులు చంద్రగ్రహం అనుగ్రహం కోసం వెండి లేక పాలరాయితో చేసిన గణపతిని నియమంగా క్రమం
తప్పకుండా ప్రతి రోజు పూజించాలి. ఇక చంద్రగ్రహ దోషాలు వున్నప్పుడు మనస్సు నిలకడగా లేకపోవుట, భయం, అనుమానం, విద్యలో అభివృద్ధి లేకపోవుట, తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవుట, స్త్రీలతో విరోధము, మానసిక వ్యాధులు, రాత్రులు నిద్రపట్టకపోవుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కువగా ఉండుట, స్త్రీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి, చంద్ర గ్రహ అనుగ్రహం కొరకు మాతృ సమానమైన స్త్రీలను గౌరవించుట, బియ్యం దానం చేయుట, పాలు, మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం,
శివునికి ఆవుపాలతో అభిషేకం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుటం ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహంతో అభివృద్ధి చెందుతారు.
Devotional
దేహాభిమానాన్ని వదిలితేనే జీవుడు… దేవుడు చిన్నికృష్ణుడు గోకులంలోని ఇండ్లలో కుండలను పగలగొట్టి వెన్నను దొంగలించినప్పుడు “కృష్ణా మా ఉపాధులనే కుండలను పగులగొట్టి హృదయమనే వెన్నను దొంగాలించావా.. ఎంత దొంగవయ్యా నీవు”.. అని… అంటుంటారు గోకులంలోని యాదవులు, భగవంతుడు మనకు మనోబుద్ధులను ప్రసాదించింది మనం మోక్షాన్ని పొందటానికే. కాలం వృధా చేసుకోకుండా ఆద్యాత్మిక చింతనతో సాధన చేసి మోక్షాన్ని పొందాలి. భగవంతుడిచ్చిన వాటిని తిరిగి ఆయనకే సమర్పించాలి. లేకపోతే దర్మం తప్పినవారవుతారు. మనసు నిజంగా లౌకికానందాల గని… అది తనకు నచ్చిన పనులు చేస్తుందే గాని బుద్ది చెప్పిన పనులు చేయదు. తల దువ్వుకోటానికో నగలు అలంకరించుకోటానికో; బూటు పాలిష్ చేసుకోవటానికో; కాలరు టై బిగించుకోటానికో; సౌందర్య లేపనాలను రాసుకోవటానికో గంటలు గంటలు ఖర్చు పెడుతుంది గాని, జపం చెయ్యటానికో, ధ్యానం చెయ్యటానికో పట్టుమని పది నిమిషాలు కేటాయించదు. భగవంతుడిని ధ్యానం చెయ్యమంటే మాత్రం అమ్మో కష్టం నావల్లకాదు బాబు అంటుంది మనసు. జపం చెయ్యటం లేదేం, ఎవరైనా గురువులు మనల్ని ధ్యానం చెయ్యండి, జపం చేయండి, దీక్షలు తీసుకొండి అంటే చాలు.. ఏదండీ గురువుగారు అసలు తీరుబాటు కావటం లేదంటారు. “మీలాగా మేం ఆస్రమాల్లో లేము గదా”.. అని పైకి అనకపోయినా లోన అనుకొంటారు. ఇల్లూ, వాకిలి, పెళ్ళాం, బిడ్డలు, ఉద్యోగం, వ్యాపారం బోలెడు జంజాటకం. ఇవన్నీ కదల నివ్వటం లేదు అంటారు. నిజంగా అవి మనను పట్టుకున్నాయా.. మానవులు వాటిని పట్టుకొని విడిచిపెట్టలేక పోతున్నారా.. మామిడి తోటల్లో రైతులు కోతుల బెడద విలించుకోటానికి కడవను తీసుకెళతారు. దాని మూతి చిన్నది, పొట్ట పెద్దది. దానిని భూమిలో గుంట తీసి పూడ్చి మూతి మాత్రం భూమిపై కనిపించేట్లు ఉంచుతారు. దానిలో వేరుశెనగ పప్పులు వేస్తారు. వాళ్ళు చెట్టు చాటున నక్కి ఉంటారు. కోతి వచ్చి కుండలో చేయి పెట్టి వేరుశెనగ పప్పులను గుప్పిటి నిండా గట్టిగా పట్టుకుంటుంది. చెయ్యి బయటకు తీయబోతే రాదు. ఎందుకంటే లోపల పెట్టేటప్పుడు ఒట్టి చెయ్యి మాత్రమే, కానీ.. బయటకు తీసేటప్పుడు పప్పులతో ఉన్న గుప్పెట. చెయ్యి బయటకు రాకపోయే సరికి అసలే చపలచిత్తం గదా.. లోపల ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నారను కుంటుంది. తాను పట్టుకున్న గుప్పెట వదిలేస్తే తంటా తీరిపోతుంది. కాని అది గుప్పెట మాత్రం వదలదు. అలా చేతిని బయటకు లాగిలాగి పడిపోతుంది. దానితో కోతులను పట్టుకునే వ్యక్తి వచ్చి వాటిని పట్టుకుంటాడు. మానవుడు కూడా అంతే కదా … ఇక్కడి విషయవాసనలను పట్టుకొని వదలడు. అవే మనను పట్టుకున్నాయని వాదిస్తాడు. పోరాడి పోరాడి చివరకు శరీరాన్ని వదిలేస్తారు గాని పట్టు మాత్రం వదలరు.. పట్టువదలరు.. దానితో యమధర్మరాజు వచ్చి పట్టుకుపోతాడు. కనుక మనస్సు విషయవస్తువుల వ్యామోహం నుండి విడివడాలి. వాటిని విడిచి మనస్సును ఈశ్వరుని పై నిలపాలి. అలా ఎవరైతే మనోబుద్ధులను ఈశ్వరుని పై నిలుపుతారో వారు ఈశ్వరుని లోనే నిలుస్తారు, నివశిస్తారు. అంటే మనోబుద్ధుల అడ్డం తొలిగితే జీవుడు దేవుడే. ‘ఇందులో ఎటువంటి సంశయం అవసరం లేదు’. మనోబుద్ధులు రెండూ మన వ్యక్తిత్వమే. ఆ రెండూ భగవంతునిలో చేరితే మన వ్యక్తిత్వం నశించి ఆయనలో ఐక్యమైపోవటం జరుగుతుంది. ఉప్పుబొమ్మ సముద్రపు లోతులను కొలుస్తున్నట్లే మనస్సు ఆత్మసాగారాన్ని మధించాలి. చివరకు ఉప్పుబొమ్మ కరిగిపోయి సముద్రాకారంగా మారిపోయినట్లు మనస్సు కరిగి ఆత్మాకారంగా మారిపోవాలి. మన దివ్యత్మాన్ని మరచి నేను సామాన్యుణ్ణి అనుకొనే మానవుడు ఈ విషయాన్ని నమ్మలేక పోతున్నాడు. ఇందులో సందేహించవలసిందేమీ లేదు. ఈశ్వరుని యందు మనోబుద్ధులు రెండింటినీ పూర్తిగా నిలపటం తీవ్ర వైరాగ్య మూర్తులకే గాని సామాన్యులకు సాధ్యం కాదు..కానీ సాధనచేస్తే సాధ్యంకానిది వుందా ఈ జగత్తులో.. మీరే ఆలోచించండి.
మీ జాతకంలో శుక్రదోషం వుంటే తప్పక స్పటిక గణపతిని ప్రతి శుక్రవారం పూజించాలి. శుక్రవార నియమం పాటించాలి. మహిళలకు సహాయకారిగా వుండాలి. చిన్నపిల్లలకు స్వీట్స్ పంచాలి. వితంతువులకు మేలు చేయాలి. ఇక మీ జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్త్రీలకు అనారోగ్యము కలుగుట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనములకు అలవాటుపడటం, వివాహం ఆలస్యం అవటం, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారంచేయటం, మత్తుపానీయాలు సేవించుట, జూదం ఆడి ఆస్తులు కోల్పోవటం, మహిళలతో తగవులు కుటుంబంలోని స్త్రీలకు అరోగ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషముగా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్రము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చేయటం, వివాహం కాని స్త్రీలకు వారి వివాహం కొరకు సహకరించుట, స్త్రీలను గౌరవించుట. వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రాక్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును.
Read Also..




Total views : 146586