సనాతనధర్మం మనిషి ఆచరించాల్సిన కొన్ని విధులను వివరించింది. వాటిలో సంప్రదాయకంగా ఆచరించాల్సిన ధర్మం… మనవతా ధర్మంతో చేయాల్సిన దానం. మనపురాణాల ప్రకాతం అష్ట మహాదానాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గరుడపురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి విపులంగా వివరించారు. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, భూమి, ఆవులను దానంగా ఇవ్వవచ్చు. ఇక ఎనిమిదో దానం ఎంటంటే విశేష ధాన్య దానం. ఇందులో ఏడు ధాన్యాలను చేర్చారు. గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒకటిని లేదా అన్నింటినీ దానంగా ఇవ్వవచ్చు. మనం అనుభవిస్తున్న కష్టాలు..నష్టాలు, ఇబ్బందులు.. ఆర్ధిక సమస్యల తీవ్రతను బట్టి మనం చేయాల్సిన దానం ఏదో నిర్ణయించుకోవచ్చు. నవగ్రహాల దోషనవారణకు మనం ఎక్కువగా నవధాన్యాలను దానం చేయటం జరుగుతుంది. వీటిలో నువ్వులకు చాలా ప్రత్యేక స్థానం వుంది. ఇవి శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలుంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలుంటాయి. ఇనుమును దానం చేయడం అనేది చాలా మందికి తెలియదు. కానీ ఇది ఎంతో ప్రశస్థమైనది. శని గ్రహదోష నివారణకు, అపమృత్యుదోష నివారణకు తప్పకుండా ఇనుము దానం చేయాలి. అయితే దీనిని దానంగా సంతోషంతో తాసుకునే వారు వుండాలి. ఈ దానం ద్వారా యమలోకానికి వెళ్ళకుండా ఉండవచ్చని శాస్త్రం తెలుపుతోంది. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటాడు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్ళరు. ఇఖ అత్యంత విలువైన లోహం బంగారం. సువర్ణదానం బ్రహ్మాదిదేవతలు, మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది. గురుగ్రహ దోషం వున్నా దీనితో తొలగిపోతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమ భటుల భయం ఉండదు. దీనిద్వారా చంద్ర గ్రహదోషం తొలగిపోతుంది. అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. మనకు వున్న ప్రతికూల , నకారాత్మక శక్తులు మననుంచి తొలగిపోతాయి. భూమిని దానం చేస్తే సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి. తీవ్ర కుజుదోషం వున్నవారు భూదనంతో వారి కుజగ్రహదోషాన్ని తొలగించుకోవచ్చు. గోదానంతో భయంకరమైన వైతరిణి నదిని దాటిపోవచ్చు. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా ఉండేవారు ఆనందిస్తారు. ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు, ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. ఈ దానాలను చేయడం వెనుక ముఖ్యవుద్దేశ్యం… లేని వానికి మనకు ఉన్నంతలో ఎంతో కొంత ఆదుకోడమే అని చెప్పవచ్చు.
Devotional
ఒకానొక సందర్భంలో నేను ‘రామానుజ దాసుడను’ అని తనకు తాను రామానుజా చార్యులకు దాసుడని పేర్కొన్నారు శ్రీరంగనాథస్వామివారు.
ఎందుకంటే రామా నుజులవారి భక్తికి ఎంతో పరవశులయ్యేవారు స్వామి. మహోన్నత భక్తులు… సమ తామూర్తి… మానవతావాది శ్రీ రామానుజాచార్యులు
అంటే శ్రీరంగనాథస్వామికి అంత ఇష్టం…. అభిమానం. అందుకే రామానుజాచార్యుల నిర్యాణం అనంతరం ఆయన పార్థివ దేహాన్ని కూడా తన ఆలయంలోనే వుంచుకున్నారు. రంగనాథస్వామి. రామానుజాచార్యు నికి రంగనాథస్వామి దాసుడిని అని పేర్కొన్న ఒక కథ ఇప్పటికీ శ్రీరంగంలో ప్రచారంలో వుంది.
కొన్ని శతాబ్దాల క్రితం శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో స్వామి ప్రసాదానికి భక్తులు బారులు తీరి వుండేవారు. ప్రతీ రోజు ప్రసాదం కొరకు ఎదురు చూస్తూ బారులు తీరిన భక్తులలో ఒక పేద వైష్ణవుడు వుండేవాడు. ఆయన రోజూ వరుసలో అందరికంటే ముందు నిలబడేవాడు. ఆయన తన కోసమేకాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం తీసుకెళ్ళేవాడు. ఆలయ అధికారులు అంత ప్రసాదాన్ని ఒకే వ్యక్తికి ఇవ్వడం సరికాదని అనేవారు. ఆయన మాత్రం ప్రసాదం ఇవ్వమని పట్టుపట్టేవాడు. ఇలా రోజూ ఆలయ అధికారులకి అతనికి కొంత వాదన జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే నీ వెనుక వున్న మిగిలిన భక్తులందరికి కొంచెమే ప్రసాదం లభిస్తుంద అని ఆలయ అధికారులు ఆ వైష్ణవుడిని మందలించేవారు. అయినా కూడా ఆ పేద వైష్ణవుడు
నా ఆరుగురు కొడుకులు ఆహారం లేక బక్క చిక్కిపోయారు, వారు ఆకలితో అలమటిస్తూ వుంటారు. నేను తీసుకువెళ్ళే ప్రసాదానికై ఎదురుచూస్తూ వుంటారు.
కనుక మీరు ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన ప్రాధేయపడేవాడు. ఒకరోజు రామానుజుల వారు వైష్ణవుడు ఆలయ అధికారులకు మధ్య జరుగుతున్న వాదోపవాదాలను చూసి అక్కడకు వచ్చారు. ఏమి జరిగిందని అడిగారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపించి రోజూ అధిక ప్రసాదం కావాలని ఆయ న గొడవ చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుడి దగ్గరకు వెళ్ళి నాయనా నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని అడుగుతారు. దానికి ఆ వైష్ణవుడు రామానుజుల వారితో స్వామీ! నా బక్క చిక్కిన కొడుకులని మీరే చూడండి, రోజంతా వారికి సేవలు చేయడ ములోనే నాకు సమయం సరిపోతుంది, వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయ లేను. పైగా నేను వేదాలను గాని, దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయ సేవ కాలములలో కూడా ఏ కైంకర్యం చేయలేను, నాకు విష్ణు సహస్ర నామం లోని కొన్ని శ్లోకాలు తప్ప ఏమి రావు, నేనేమి చేయగలను అని బదులిచ్చాడు ఆ పేద వైష్ణవుడు. సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పు అన్నారు రామానుజులవారు. ఆ వైష్ణవుడు ఎంతో ఇబ్బందిగా విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు:, భూత కృత్ భూత భృత్.. అని ఆపేసి, నాకు అంతవరకే
వచ్చు స్వామీ! అని చెప్పాడు. అతని ఇబ్బంది చూసి రామానుజులవారు సరే నీకు ‘భూత భృత్’ అనే భగవన్నామము తెలుసుకదా! ఆ నామాన్నే జపించు, ఇక నీకు ఇక్కడికి ఆహారార్థియై రావలసిన అవసరం ఉండదు” అని సెలవిచ్చారు. ఆనాటి నుండి ఆ వైష్ణవుడు ఇంకెప్పుడూ కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపిం చలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలయింది. రోజూ రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమై పోతుంది. పంచడానికి కొంచెమే వుంటోంది. ఆలయంలో ప్రసాదం దొంగల బారిన పడుతుందేమో అని భద్రత పెంచారు కూడా. అయినా రంగనాథులకు సమర్పించిన ప్రసాదంలో చాలా భాగం మాయమైపోతున్నది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం వస్తున్నది అందరికి. చివరకు ఈ సమస్య గురించి రామానుజులకి తెలియచేసారు. ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలుచుకు రమ్మని రామానుజుల వారు మనుషులని
పంపారు. వారు తిరిగి వచ్చి ఆయన ఆలయానికి దగ్గరగా వున్న తన పాత నివాసంలో ఉండటంలేదని తెలిపారు. ఆ తరువాత కూడా ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ సమాచారం తెలియలేదు. కొంత కాలం తర్వాత, రామానుజులు ఏదో కార్యక్రమానికై శ్రీరంగం దగ్గర కావేరి నది పాయ దాటుతుండగా ఈ వైష్ణవుడు ”స్వామీ… స్వామీ” అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించాడు. రామానుజులవారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసాడు. ఆయన కనుల నుండి ధారగా కన్నీరు రాసాగింది. స్వామీ! మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందచేస్తున్నాడు. అందువల్ల నా పిల్లలు సరిపడినంత పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేశాను. నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజూ నేను “భూత భృతే నమ:” జపాన్ని చేస్తున్నాను. అన్నాడు. అతని మాటలు విన్న
రామానుజులు ఆశ్చర్యచకితులయ్యారు. “ఎవరా పిల్లవాడు? వాని పేరేమిటి?” అని అడిగారు. ఆ పిల్లవాడు తాను రామానుజాదాసుడనని చెప్పాడు స్వామీ
అన్నాడు వైష్ణవుడు. రామానుజాచార్యులవారికి అంతా అర్థమయింది. ‘భూత భృత్’ నామానికి అర్థం ‘సమస్త జీవుల’ని పోషించువాడు అని అర్థంకదా!
రామానుజుల వారి ఆజ్ఞానుసారం ‘భూత భృత్’ను పఠించిన వైష్ణవుడి ఆకలి బాధలను తీర్చారు ఆ రంగనాథస్వామి. ఇంతకీ ఆ బాలుడు ఇంకెవ్వరు సాక్షాత్ శ్రీరంగనాథుడే అని తెలుసుకున్నారు శ్రీరామా నుజాచార్యులు. బాలుడి రూపంలో రంగనాథుడి దర్శనం రోజూ పొందుతున్న ఆ వైష్ణవుడి అదృష్టానికి పరవశులయ్యారు రామానుజులవారు. ఇలా స్వామివారే స్వయంగా తనని తాను రామానుజ దాసుడిని అని తెలియచేయటం ఎంతో విశేషం… అలాగే రామానుజలవారి జన్మధన్యతకాగా రామానుజలవారిని తన ఆలయంలోనే వుంచుకున్నారు స్వామి శ్రీరంగనాథుడు.
Read Also..
Read Also..
1 మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.
2 ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె. అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.
3 ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయం లో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.
4 కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.
5 అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి, కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.
6 వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.
7 ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.
8* భీమవరంలో సోమేశ్వరుడు, ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు
9 కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి, ఇక్కడికి కాకులు అసలు రావు
10 గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది. ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.
11 బైరవకొన ఇక్కడకు కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.
12 యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు
13 శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక వైపు ఒకప్పుడు “ఝుం”అనే తుమ్మెద శబ్దం వినపడేదట
14 కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. సంవత్సరంలో 6నెలలు ఈ దేవలయం నీటిలో మునిగి మిగిలిన 6 నెలలు గుడి బయటకు కనిపిస్తుంది.
15 శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది.
17 అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.
18* కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యి వుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.
19 మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.
20 కంచి ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.
21 తమిళ నాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.
22 హిమాచల్ ప్రదేశే రాజధాని సిమ్లాకు సరిగ్గా 235 కిలోమీటర్ల దూరంలో కిన్నౌర్ జిల్లా ఉంది.. ఈ కిన్నౌర్ జిల్లా హిమాలయ పర్వత సానువుల్లో నెలకొని వున్న కిన్నెర కైలాసము. ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం , రాత్రి నీలంగా మారుతుంది.
అమ్మవారి ఆరాధన విశిష్ఠతను తెల్సుకోవాలంటే ముందు అమ్మను అనుగ్రహించమని వేడుకోవాలి. మహాశక్తిని మనః పూర్వకంగా ప్రతి క్షణం ధ్యానించాలి. శక్తికి సంబంధించిన మంత్ర, తంత్ర విధానం గురువుద్వారా పొందాలి. అమ్మవారి కోరిక మేరకుపరమేశ్వరుడు శ్రీ తంత్రమును శ్రీవిద్యగా అనుగ్రహించాడు అని పండితుల తెలియచేస్తుంటారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు త్రిపుర సుందరి అమ్మవారిని ఉపాసించి కొన్నివేల శ్లోకాలతో దత్త సంహితను రచించారని అంటారు పండితులు . లలిత సహస్ర నామ భాష్యం మనకు భాస్కరాచార్యుల వారు అందించారు. ఆయన రచనలు మూడిటిని శ్రీ విద్య ప్రస్థానత్రయం గా పేర్కొంటాము. జగద్గురువులు, వ్యాసులవారి ఆర్యాద్విశతి, శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి మొదలగు అమ్మవారి స్తోత్రాలను మనకు అందించారు. నేడు ఆ స్తోత్రాలతోనే మనం శ్రీచక్రాన్ని పూజించి అమ్మవారి అనుగ్రహాని పొందగలుగుతున్నాం. అరవిందుల వారు, శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు దశ మహా విద్యలు గురించి వివరించారు. కాళి, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తా, ధూమవతి, భగళ, మాతంగి, మరియు కమలాత్మిక. ఈ పేర్లతో అమ్మవారిని దశమహావిద్యలలో మనం ఆరాధిస్తాం .అమ్మ కొలువుదీరిన ప్రదేశాలు ఎన్నెన్నో ప్రసిద్ద క్షేత్రాలుగా పేరుగాంచాయి. మహిమలను చూపాయి.హిమాలయాలలో
ఉమాదేవి, కశ్మీర్లో అంబ సరస్వతి గానూ, వారణాసిలో విశాలాక్షి, కన్యా కుబ్జంలో గౌరీ, మహారాష్ట్రలో భవాని, కలకత్తా కాళీ దేవి, కన్యాకుమారి బాల, మధుర లో మీనాక్షి, శ్యామల, మంత్రిణి గానూ, జంబుకేశ్వరం అఖిలాండేశ్వరి దేవి లేదా దండిణి , కాంచీపురం లో కామాక్షి లేదా మహా త్రిపుర సుందరి, శృంగేరిలో శారదా దేవి, మైసూరులో చాముండేశ్వరి, భగవతి గా కేరళ లోనూ, శివ శక్తి స్వరూపంగా అమ్మవారు పూజలందుకుంటోంది. నవరాత్రులలో ప్రతి గృహంలోనూ దుర్గా లక్ష్మి సరస్వతి గా, ముగ్గురమ్మల మూలపుటమ్మ గానూ పూజింపబడుతుంది శ్రీలలితా పరాభట్టారిక. ఏ రూపంలో అమ్మ పూజలు అందుకున్నప్పటికీ శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పినట్లుగా పరబ్రహ్మ స్వరూపంగా జగత్ ప్రసిద్ది పొందింది. నిజమైన సౌందర్యాన్ని చూడాలి అంటే అమ్మనే చూడాలి. భక్తి భావంతో చూడాలి. అత్యంత ప్రశాంతమైన అద్భుతమైన రూపం అమ్మది. ఆ అమ్మ శక్తి స్వరూపం. వేదాలలో ఆమెను శ్రీ సూక్తం ,దుర్గా సూక్తం, భూ సూక్తం త్రిపుర, భవానోపనిషధ్ లు,ఇతర దేవీ ఉపనిషద్ లలో శివశక్తి రూపిణీ గా అభివర్ణించారు. నిత్యం చేసే సంధ్యా ఉపాసనలో గాయత్రీ దేవిగా కరుణిస్తుంది. మార్గ దర్శనం చేస్తుంది అన్ని పురాణ కథలు లో కార్య సాధన కోసం ఆమెని ప్రార్థించారు. కళ్యాణం కోరిన వరునితో జరగడానికి సాక్షాత్ రుక్మణీదేవి కూడా ” హరిన్ పతి సేయుమమ్మా.”అంటూ వేడుకోవడం పోతన గారు అందంగా మనకు భాగవత కథలోఅందించారు. బ్రహ్మ పురాణంలోని లలితా సహస్రనామ స్తోత్రము మరియు త్రిశతి అమ్మను ఏ విధంగా కొలవాలి. అని మార్గం చూపుతాయి. మార్కండేయ పురాణం కూడా శక్తి స్వరూపంగా లలితా దేవిని చండీ రూపంలో ఆరాధన మంచిదని అని చెప్తుంది. ఆగామ,రహస్య, సంహిత,యమల, అర్ణవ,తంత్ర…ఇలా పరి పరి విధాల అమ్మను కొలవడం తెలిసిందే. ఇలా శ్రీలలితా పరాభట్టారిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్పిస్తుంది.
జాతకంలో రాహుగ్రహదోషం వున్న వారు తప్పకుండా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం నిష్టగా..నియమంగా మట్టితో చేసిన గణపతిని బెల్లం ప్రసాదంగా పెట్టి, గరికతో పూజించాలి. తద్వారా రాహుగ్రహ అనుగ్రహం తప్పక కలుగుతుంది.ఇక మీ జాతక చక్రంలో రాహువు బలహీనముగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలా పాలు చేయుటయందు ఆసక్తి, నీచమనుషులతో సహవాసము, సంఘవిద్రోహ చర్యలు, జైలు శిక్షలు అనుభవించుట, కుష్టు లాంటి వ్యాధులు, విద్యార్థులు చదువు మధ్యలో మానివేయుట, పాడుపడిన ఇంటిలో లేదా దాని పరిప్రాంగణంలో నివసించుట, ఇంట్లో బొద్దింకలు, పందికొక్కు లు, పాములు సంచరించటం, గురువును అవమానించటం, రాత్రి వేళలో భయంకరమైన కలలు రావటం, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట, గృహంలో విద్యుత్తుతో పనిచేసే వస్తువులు పాడగుట, విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవటం, అనేకరకాల అవమానాలు భరించాల్సి రావటం… మొదలగునవి జరిగునప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి, దోష నివార ణకు కనక దుర్గ అమ్మవారిని పూజించుట, దేవి భాగవతం పారాయణం చేయుట, గోమేధికం గాని ఎనిమిది ముఖములు గల రుద్రాక్షను గాని ధరించుట. భవాని మాల ధరించుట, స్త్రీలను గౌరవించటం వలన రాహు గ్రహ అనుగ్రహం కలుగును. ఈ సమయంలో ఎక్కువగా దుర్గా సప్తశ్లోకి పఠించటం చాలా మంచిది.
స్కాంద పురాణంలో..బ్రహ్మ ఖండంలో.. రామేశ్వర క్షేత్రంలో 24 తీర్ధాలు ఉన్నట్లు వర్ణించబడింది. అవి.. చక్ర తీర్ధం, భేతాళ వరద తీర్ధం, పాప వినాశనం, సీతా సరస్సు, మంగళ తీర్ధం, అమృత వాపిక, బ్రహ్మ కుండము, హనుమత్కుండం, అగస్త్య తీర్ధం, రామ తీర్ధం, లక్ష్మణ తీర్ధం, జటా తీర్ధం, లక్ష్మీ తీర్ధం, అగ్ని తీర్ధం, శివ తీర్ధం, శంఖ తీర్ధం, యమునా తీర్ధం, గంగా తీర్ధం, గయా తీర్ధం, కోటి తీర్ధం, స్వాధ్యామృత తీర్ధం. సర్వ తీర్ధం, ధనుష్కోటి తీర్ధం, మానస తీర్ధం. రావణాసురుని చంపిన బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తుడు అవటానికి శ్రీ రాముడు శివలింగ ప్రతిష్టాపనను రామేశ్వరంలో చేయ సంకల్పించాడు. సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన “పుల్ల” గ్రామానికి దగ్గరలో, సేతువుకు సమీపంలో, గంధమాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని శ్రీరాముడి సంకల్పం. హనుమంతుని కైలాసం వెళ్లి శివుని అనుగ్రహంతో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు. ముహూర్త విషయాన్ని కూడా తెలిపి, ఆ సమయం లోపలే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. హనుమంతుని రాక ఆలస్యమై ముహూర్తం మించి పోతుండగా, మహర్షుల అనుమతితో సీతాదేవి ఇసుకతో శివ లింగాన్ని చేస్తే, సరిగ్గా ముహూర్త సమయానికి దాన్ని ప్రతిష్టించాడు శ్రీ రామచంద్రుడు’. ఆ లింగానికి అభిషేకం జరిపి, పూజ కూడా చేసేశాడు. మారుతి శివలింగాన్ని తీసుకొని వచ్చాడు. విషయం తెలిసి బాధపడి తాను తెచ్చిన లింగాన్ని ఏమి చేయాలని రామున్ని ప్రశ్నించాడు. దానికి ఆయన వేరొక చోట ప్రతిష్టించమని చెప్పాడు. హనుమకు కోపం వచ్చి “రామా! నన్ను అవమానిస్తావా? సైకత లింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకొన్నప్పుడు నన్నెందుకు కైలాసం పంపావు? ఇంకో చోట ప్రతిష్ట చేయటం కోసమా నేను అంత దూరం వెళ్లి నాకీ జీవితం వద్దు. నా శరీరాన్ని సముద్రుడికి త్యాగం చేస్తాను” అని దూకబోతుండగా రాముడు వారించాడు” హనుమన్నా! మనిషి తను చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తాడు. ఆత్మను చూడు. దుఖం పొందటం వివేకికి తగనిపని. దోషాన్ని వదిలి మంచిని గ్రహించు. నువ్వు తెచ్చిన లింగాన్ని వేరే చోట స్థాపిద్దాం. ఈ రెండు లింగాలను దర్శించినా, స్మరించినా, పూజించినా పునర్జన్మ ఉండదు. భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన శివలింగాన్ని పూజించి, ఆ తర్వాతే ఇసుక లింగాన్ని పూజిస్తారు. అలా కాకపోతే ఈ సైకత లింగాన్ని పీకేసి సముద్రంలో విసిరెయ్యి” అన్నాడు. అప్పుడు హనుమ తన తోకను ఇసుకలింగం చుట్టూ బిగించి పెకలించటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. అది ఇసుమంత కూడా కదలలేదు. హనుమ తన వివేకంతో ఆలోచించి తన తప్పిదాన్ని తెల్సుకుని సీతారాములకు ప్రణమిల్లాడు. అప్పుడు సీతారాములు హనుమ తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని ప్రతిష్టించారు. హనుమ సైకతలింగం పెకలిస్తూ క్రింద పడిన ప్రదేశం అంతా రక్తపు మడుగైంది. అదే “హనుమత్కుండం”. ఇది రామేశ్వరానికి కొద్దిదూరంలో ఉంది. దీనిలో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని రాముడు ప్రకటించాడు. పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే స్వర్గానికి వెళ్తారని సీతా రాములు అనుగ్రహించారు.
Read Also..
మన జాతక చక్రంలో గురుడు బలహీనంతగా ఉన్నట్లయితే.. పసుపు లేదా చందనం లేక బంగారంతో చేసిన గణపతిని ప్రతి గురువారం క్రమం తప్పకుండా ఆరాధించాలి. కనీసం పసుపు రంగులో వున్న గణపతి విగ్రహాన్ని తప్పక పూజించాలి. నియమంగా ప్రతిరోజు గణపతికి గరికతో పూజ చేసి, శనగలు, బూందీలడ్డు ప్రసాదంగా కొంతమందికి పంచినట్లైతే మీకు మేలుకలుగుతుంది. గురు గ్రహం అనుకూలంగా వుంటుంది. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుటం, దైవంపై నమ్మకం లేకపోవుటం, పెద్దలంటే చులకన భావం, సంప్రదాయాలను, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆసక్తి లేకపోవటం లేక ఆటంకాలు, మూర్ఖంగా, నియంతగా ప్రవర్తించుటం, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసి నా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి చాలా తక్కువగా వుండటం, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను గౌరవించుట, క్షేత్రయాత్రలు చేయటం, శనగలు దానం చేయుట, పసుపు రంగు వస్త్రాలనుదానం చేయటం, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరిస్తే మంచిది.
మన జాతక చక్రంలో బుధుడు బలహీనంతగా ఉన్నట్లయితే.. మరకత గణపతిని ఆరాధించాలి. అంటే ముదురు ఆకుపచ్చ రంగులో వున్న గణపతి విగ్రహాన్ని తప్పక పూజించాలి. నియమంగా ప్రతిరోజు గణపతికి గరికతో పూజ చేసి, నానబెట్టిన పెసలు ప్రసాదంగా కొంతమందికి పంచినట్లైతే మీకు మేలుకలుగుతుంది. బుధ గ్రహం అనుకూలంగా వుంటుంది. ఇక జాతకంలో బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత, జ్ఞాపకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ పెద్ద ఎత్తున ధననష్టం మొదలగునవి జరుగుతుంటాయి. బుధగ్రహ దోషంగా గుర్తించి బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంకటేశ్వరస్వామి వారిని విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట, ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట,పెసలు దానం చేయుట, విద్యార్థులకు పుస్తకాలను దానం చేయట వలన బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.
జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉంటే తప్పకుండా రాగితో గానీ, ఎర్రటి మెటల్ తో చేసిన గణపతిని పూజించాలని పరిహారశాస్త్రం తెలియచేస్తుంది. ప్రతి మంగళవారం నియమంగా గణపతిని పూజించి, మోదకాలు పిల్లకు పంచిపెట్టాలి. కుజ దోషం వుంటే ధైర్యం లేకపోవుట, అన్న దమ్ములతో సఖ్యత నశించుట, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధింపులు అప్పులు తీరకపోవుట, ఋణభాద తల ఒత్తిడి, రక్తానికి సంబంధించిన వ్యాధులు, శృంగారం నందు ఆసక్తి లేక పోవడం,కండరాల బలహీనత,రక్తహీనత, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలుగుతాయి. ఇలాంటివన్ని కుజ గ్రహ దోషముగా గుర్తించి కుజ గ్రహ అనుగ్రహం కొరకు సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం, అన్నదమ్ములకు సహాయం చేయడం, వారి మాటలకు విలువ ఇవ్వడం, స్త్రీలు ఎర్రని కుంకుమ,ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి.
తిరుమలలో అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాన్ని అందించే పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.38 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విరాళం మొత్తం గతంలో రూ.33 లక్షలు ఉండగా, ఆ మొత్తాన్ని టీటీడీ రూ.38 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.పెరిగిన ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఉదయం అల్పాహారం కోసం రూ. 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని టీటీడీ పేర్కొంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చని టిటిడి ప్రకటించింది.




Total views : 146687