Devotional
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలివేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
సాయంత్రం 4.20 నుండి 5.20 గంటల వరకు అమ్మవారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించునున్నారు.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఆధ్వర్యంలో నరక చతుర్దశి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో తిరువీధి నిర్వహించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మధ్యరంగం మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరకాసుర ప్రతిమను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, ఆలయ ఈవో గొలమరి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు, కమిటీ సభ్యులు, ఉభయ దాతలు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుచానూరు.
అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనం ఇచ్చారు.
అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు , కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.
ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును , తరుణోపాయమును తెలుపమని’ అడుగగా, గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితాల గురించి పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు. ‘‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు.
పాదముల యందు – పితృదేవతలు కాళ్ళ యందు – సమస్త పర్వతములు భ్రూమధ్యమున – గంధర్వులు దంతముల యందు – గణపతి ముక్కున – శివుడు ముఖమున – జ్యేష్ఠాదేవి కళ్ళయందు – సూర్య, చంద్రాదులు చెవుల యందు – శంఖు చక్రములు కంఠమునందు – విష్ణుమూర్తి భుజమున – సరస్వతి రొమ్మున – నవ గ్రహములు వెన్నునందు – వరుణ దేవుడు , అగ్ని దేవుడు తోక యందు – చంద్రుడు చర్మమున – ప్రజాపతి రోమములయందు – త్రింశత్కోటి దేవతలు నివసించెదరు. అందువల్ల గోమాతను పూజించి పాపములను పోగొట్టుకొని ఆయురారోగ్యములను, అష్టశ్వైర్యములను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యము కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణము చేస్తే భూమండలము అంతా ప్రదక్షిణము చేసినంత ఫలము కలుగుతుంది. స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!! శ్రీ రామ రక్ష! సర్వ జగవూదక్ష !!’’ అని ముగించెను.
Read Also..
Read Also..
శివుడు ఏకాదశ రుద్రస్వరూపము. ఆంద్రదేశము నందు పదునొకండు శివ క్షేత్రములు కలవు. వాటి దర్శనము మహాఫలమునందించును. అవి 1) బృహత్ శిలానగరము నందలి నగరేశ్వరుడు 2) శ్రీశైలము నందలి మల్లికార్జునుడు 3) ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు 4) క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు 5) అమరావతి నందలి అమరలింగేశ్వరుడు 6)కోటీఫలీ క్షేత్రము నందలి కోటీఫలీశ్వరుడు 7) పీఠికాపురము నందలి కుక్కుటేశ్వరుడు 8) మహానంది యందలి మహానందీశ్వరుడు 9) కాళేశ్వరము నందలి కాళేశ్వరుడు 10)శ్రీకాళహస్తి నందలి కాళహస్తీశ్వరుడు మరియు 11) త్రిపురాంతకము నందలి త్రిపురాంతకేశ్వరుడు. వాస్తవమునకు శివునకు మూర్తి లేదు. శివలింగము ఆత్మలలో వెలిగే జ్యోతిస్వరూపము గాక మరేమియు కాదు. సిద్ధి కలిగిన తదుపరి నిర్మలమనస్సు రూపములో నుండెడి నిర్మలతయే స్ఫటిక లింగము. మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానము కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడును. మెదడు నుండి నరముల రూపములో మెడ క్రింది వరకూ వ్యాపించి యుండు నాడులను రుద్రజడలందురు. శివుని హఠయోగి రూపములో లకులీశుడందురు. శివుడు భిక్షాటనము చేసి జీవుల పాపకర్మలను హరించును. ఈ సృష్టియందు రాగతాళ బద్ధమయిన సృష్టి, స్థితి, లయములనెడి మహాస్పందనల కనుగుణంగా ఆనంద తాండవమును చేయును గనుక శివుని నటరాజు అని అందురు. శివుడు పరమానందకారకమైన మోక్షసిద్ధిని కూడా యీయగలడు. చిత్ అనగా మనస్సు, అంబరమనగా ఆకాశము లేక బట్ట. ఆకాశ రూపములో ఉండువాడే చిదంబరుడు. నీవు చూచెడి యీ విశాల విశ్వములోని రోదసీస్వరూపము రుద్రస్వరూపమే! ద్వాదశ జ్యోతిర్లింగములు రాశి చక్రములోని 12 రాసులకు ప్రతీకలు. కనుక శివుడు కాలస్వరూపుడు. అష్ట దిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే. పంచభూతములు అతని పంచముఖములు. పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు కలిసి ఏకాదశ రుద్ర కళలగుచున్నవి. వీరినే ఏకాదశ రుద్రులందురు. ఉమామహేశ్వర రూపము నిత్యప్రసన్న రూపము. త్రిగుణములను భస్మం చేసిన రూపమే త్రిపురాంతకరూపము. జ్ఞాననేత్రమే మూడవకన్ను సమాధిస్థితిలో ప్రసన్నమైన ధ్యానములో నుండగా నిరంతరాయముగా ప్రవహించు పవిత్రతయే శివజటాజూటములోని ఆ పరమపావని గంగామాత. అది మిధునమైన శివపార్వతుల స్వరూపమే మిధునరాశి. ఆర్ధ్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనం యిస్తాడు. మిధునరాశిని సమీపించుటకు ముందు వృషభరాశిని దాటి వెళ్ళవలెను గదా! ఆ వృషభమే నందీశ్వరుడు. అది ధర్మస్వరూపము. భ్రూమధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ! యోగస్థితి వలన ఏర్పడే కామజయము వలన స్త్రీ పురుష భేదము నాశనమై ఏకత్వ స్థితిని పొందుచున్న స్వరూపమే అర్థనారీశ్వరరూపము. సహస్రారంలో లింగోద్భవకాలములో కర్పూరకళిక భగవత్ జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. లింగమనగా స్థూల శరీరములో లోపల దాగియుండే లింగశరీరం. ఇది జ్యోతిరూపంలో వెలుగుతూ ఉంటుందని వేదము చెప్పుచున్నది. శివపూజారహస్యములు అనుష్ఠానము చేతను, గురుకటాక్షము చేతను మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. భౌతికరూపమైన పీఠికాపురమెట్లుండునో జ్యోతిర్మయి స్వరూపమైన స్వర్ణపీఠికాపురమనునది ఒకటున్నది. అది నా చైతన్యముచే నిర్మితమయినది. దానిని నన్ను నిరంతరము స్మరించే భక్తులు, జ్ఞానులు అనుభవముతో తెలుసుకొనగలరు. వారు ఎంతెంత దూరములలో ఉన్ననూ స్వర్ణ పీఠికాపురవాస్తవ్యులే అగుదురు. వారికి నేను సర్వదా సులభుడను. భౌతిక పీఠికాపురములోని కుక్కుటేశ్వరాలయము నందు నీవు చూచిన అర్చకస్వాములు ప్రమధ గణముల అంశచే జన్మించినవారు. భూతప్రేత పిశాచాది మహాగణములు ఎన్నియో ఉండును. యోగాభ్యాసము చేయుకొలదినీ, శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించు కొలదినీ, ఆయా భూతప్రేతములు అలజడి సృష్టించుచునే యుండును. ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు. నా పేరిట మహాసంస్థానము మా మాతామహ గృహమున ఏర్పడితీరునని అనేక పర్యాయములు చెప్పితిని. నా సంకల్పము అమోఘము. చీమలబారుల వలె లక్షోపలక్షల భక్త గణములు, యోగి గణములు నా సంస్థానమును దర్శించగలరు. ఎవరు, ఎప్పుడు, ఎంతమంది, ఏ విధానముగా రావలయునో నేనే నిర్ణయించెదను. పీఠికాపుర వాస్తవ్యులయినంత మాత్రమున శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానమునకు వచ్చి దర్శనము పొందగలరనుకొనుట సర్వకల్ల. నా అనుగ్రహము యోగ్యులపై అమృత వృష్టి కురిపించును. అయోగ్యులకు అది ఎండమావివలె నుండును.
Read Also..
Read Also..
పరమాత్మ ప్రక్రుతి అంతా నిండి ఉంటాడు. ఆయనను పలురూపాలుగా భావించి ధ్యానించే భక్తులకు ఆయన ఉనికిని అనేకానేక విధములుగా తెలియపరుస్తుంటాడు. భావన బలంగా ఉండాలి.అందుకే పెద్దలు శివుణ్ణి ఆరాధించాలంటే నీవు శివునిగా మారాలి అంటారు. అదే మహన్యాసం గా సాగుతుంది శివాభిషేకం లో ఇక్కడ శివతత్వాన్ని తన అన్ని అంగములలో భావన చేస్తాడు సాధకుడు. ఇక్కడ పీఠం లో జరుగుతున్న హనుమంతుని ఉపాసనా ,వచ్చేసాధకుల స్థితి ననుసరించి ఆయన అనుగ్రహప్రసారం ఎలాఉంటున్నదో అనేక ఉదాహరణలద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాము. స్వామి ఉపాసనను చూసి పులకించి తామూ స్వామి భావాన్ని ధ్యానిస్తున్నాయేమో ఇక్కడ చెట్లు. తీయని ఫలములనిస్తున్న నేరేడు చెట్లు కూడా అలానే ధ్యానించి స్వామి పట్ల అపార ప్రేమతో ఉన్నాయో గాని ఓఫలం లో స్వామి రూపాన్ని ఆవిష్కరించాయి. ఈరోజు పూజసమయంలో నివేదన చేయటానికి మాతమ్ముడు పీఠం లో గల నేరేడు పండ్లు కోసితెచ్చాడు. అనుకోకుండా చేతిలో పండ్ల లో ఓ పండు హనుమ ముఖ రూపంతో కనపడింది. వేంటనే నాదగ్గరకొచ్చి చూపాడు. నల్లని నేరేడు ఫలానికి ఓవైపు ఎర్రని పెదవులుగా దానిపైన రెండు కన్నులుగా ప్రకృతిమాత చెక్కి ఇచ్చిన ఆరూపం . ఆనందాన్ని కలుగ జేసింది. ఆ ఫలాన్ని ఇచ్చిన చెట్టు స్వామిని ఎంతగా ధ్యానిస్తున్నదో కదా ! ఎంతటి అదృష్టమో కదా ఆవృక్షానిది.
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు చెప్పినమాట అక్షరాలా కోట్లు విలువచేసే మాట…..!!
పెద్దలు చెప్పిన ఈ సూక్తికి నూటికి నూరుశాతం సరిపోయో కధ.. మనందరికీ వర్తించేది విశ్వామిత్రుని కోపం…కధ. పూర్వం విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు పూర్తయ్యాక లేచాడు. అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. మాటామాటా కలిసింది ఆపై మాటలుపెరిగాయి. తర్వాత అంతులేని కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. ఇంద్ర స్వర్గాన్ని తలదన్నే స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు… అదే త్రిశంఖు స్వర్గం! అయితే పుణ్యాత్ములంతా దేవేంద్రుడి స్వర్గానికే వెళతారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తిని ధారబోసి సృష్టించిన స్వర్గంలోకి వెళ్ళరు. కొన్నాళ్ళకి దేవేంద్రుడి పై వున్న ఆవేశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు ‘అయ్యయ్యో తపశ్శక్తిని అంతా దేవేంద్రుడి పై కోపం, ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే!’ అని మళ్ళి తపస్సు ప్రారంభించాడు. మళ్ళి 1000 సం.లు పూర్తయ్యాయి. ఈసారి ఇంద్రుడు తాను వెళితే వ్యవహారం విజయవంతం కాదని విశ్వామిత్రుడు… , పెద్దగా స్పందించడని గ్రహించి తెలివిగా ఊర్వశిని పంపాడు. విశ్వామిత్రుడు తప్పస్సు నుండి లేచేసరికి ఊర్వశి ఎదురుగా వయ్యారాలు వొలికిస్తూ నిలబడి ఉంది. ఊర్వశిని చూసిన విశ్వామిత్రుడు మోహితుడయ్యాడు. అంతలోనే సందేహం వచ్చి ఇది అంతా ఇంద్రుడి మాయ అని గ్రహించి, రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చి నట్లు గ్రహించి, ఆమె పదివేల సంవత్సరాలు పాషాణ రూపంగా మారిపోయేటట్లు తన తపోశక్తిచే శపిస్తాడు. ఆ తరువాత క్రోధ వశుడనైనాను అని భావించి, బ్రాహ్మణోత్తముడు నిన్ను ఉద్ధరించగలడు అని రంభకి శాపవిమోచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు చేసు కోవడానికి వెళ్ళి పోతాడు. అనంతరం విశ్వామిత్రుడు తన తపోశక్తి వృథా అయినందుకు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళి తపస్సు చేశాడు. ఈసారి పరమశివుడిని మెప్పించటానికి వేయి సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుడి అనుగ్రహంతో వివిధ అస్త్రాలను వాటి ప్రయోగ రహస్యాలను పొంది సంతోషించే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు. తను వెళ్ళినా, ఊర్వశిని పంపినా ఉపయోగం ఉండదని ఈ సారి ఇంకొంచేం జాగ్రత్తగా పధకం వేసి విశ్వామిత్రుడుకి వశిష్టుడిని ఎదురుపడేలా చేశాడు. విశ్వామిత్రుడు వశిష్టుడిని చూసేసరికి అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు… తను మహాదేవుడి నుండి పొందిన దివ్యాస్త్రాలను ప్రయోగించాడు.. అవి అన్నీ వశిష్ఠమహర్షి బ్రహ్మదండంలో కలిసిపోతాయి.అంతే వెయ్యేళ్ళ తపశ్శక్తి అంతా క్షణకాలంలో పోయింది. తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు ‘అయ్యయ్యో ఎంత పొరబాటు చేశాను. తపశ్శక్తిని క్షణకాలంలో వృథా చేసేశాను,’ అని బాధపడ్డాడు. ఇంద్రుడు ఎదురుపడినప్పుడు ఆవేశాపడినా తపశ్శక్తి పోవడానికి చాలాకాలం పట్టింది. ఊర్వశి ఎదురుపడినప్పుడు మోహించినా కూడా తపశ్శక్తి పోవడానికి చాలాకాలం పట్టింది. కాని కోపం రావడం వల్ల తపశ్శక్తి పోవడానికి కేవలం క్షణకాలంలో హరించుకు పోయింది. కోపం అంత బలమైనది. ఒకరిని తిట్టి తెగ సంబరపడిపోతూ ఉంటారు చాలామంది. కాని అలా తిట్టడం వల్ల వారి దోషాలు తొలగిపోతాయి. మీరు ఎంతోకాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం క్షణకాలంలో హరించుకొని పోతుంది. వేయి సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపస్సే క్షణకాలంలో పోయినప్పుడు, యే సాధనలు లేని మామూలు జీవితం గడిపే సామాన్యుడికి కోపం మహాపెద్ద శత్రువు. మన కోపంతో మంచి హరించుకుపోతే మిగిలేది చెడే. చెడు సంస్కారాలు ప్రబలితే మిగిలేది బాధలు, దుఃఖం, అనారోగ్యం పేదరికం! మీరు ఎందులో బలంగా ఉంటే దాన్నే దెబ్బతీస్తుంది మీ కోపం. మీ కోపమే మీ శత్రువు. ఈ కధని దృష్టిలో పెట్టుకొని మీ కోపం తగ్గించుకోండి! అందున మంచి స్థితి, హోదా, పదవిలో వున్న వారు మరింత జాగ్రత్తగా వుండాలి అనేది ఈ కధ సారాంశం.
Read Also..
గోమతి చక్రాలు అరుదుగా సహజంగా ఏర్పడే “సముద్రం నుంచి ఉద్బవించే గుల్ల”. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రంలో గల ద్వారకలోని గోమతినదిలో లభిస్తాయి. వీటి ఆకారం గుండ్రంగా వుంటుంది కనుక వీటిని గోమతి చక్రాలు అంటున్నారు. చంద్రుడు వృషభరాశిలో రోహిణి నక్షత్రం లో వున్నప్పుడు లేదా తులారాశిలో స్వాతి నక్షత్రంలో వున్న సమయంలో కొన్ని రసాయన అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి. వృషభ,తులా ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి. భార్గవమహర్షికి జన్మించిన లక్ష్మీ దేవికి శుక్రుడు సోదరుడు కావటం వలన శుక్రుడు రోహిణి,స్వాతి నక్షత్రాల్లో తన స్వంత రాశుల్లో వన్న సమయంలో ఈ చక్రాల ఉద్భవించటంచేత వీటికి లక్ష్మీదేవి కటాక్షం వుంది అని పెద్దలు తెలియచేస్తుంటారు. వీటి ఉపయోగాలు అనేకం అనంతం అని చెప్పవచ్చు. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి. గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుందంటారు. దీనినే “నాగచక్రం” అని “విష్ణుచక్రం” అనికూడ అంటారు. ఇది నత్త గుల్ల ఆకారాన్ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని “నత్త గుల్ల రాయి” అని కూడ అంటారు. గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. కొన్ని గోమతిచక్రాల ముందుభాగం తెల్లగాను, మరికొన్ని కొన్నిఎర్రగాను ఉంటాయి. తెల్లగా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకలకార్యసిధ్ధికి, ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి. ఎర్రగా ఉన్నగోమతిచక్రాలు
వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్ర ప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమేఉపయోగిస్తారు కొందరు. గోమతి చక్రాలను బీరువాలో గాని పర్సులో గా ఉంచితే ధనాభివృద్ధి ఉండి ఎప్పుడు ధనాని లోటు ఉండదు. గోమతి చక్రాలను బ్రాస్లేట్ గా అమర్చుకొని చేతికి ధరిస్తే కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరి ఇవ్వని వారి పేరు గోమతి చక్రాల మీద వ్రాసి నీటిలో వేయటం గాని, వాటిని వెంట పెట్టుకొ డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళి డబ్బులు అడిగితే మనం అప్పుగా ఇచ్చిన డబ్బులను త్వరగా రాబట్టుకొనే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని
మంగళవారం రోజు చేస్తే ప్రయోజన కలుగుతుంది అని అంటారు. ఇలా గోమతి చక్రంను సరైన విధంగా వుపయోగించటంవల్ల లక్ష్మీకటాక్షంతో పాటు, శుక్రగ్రహ దోషాలు తొలగి జీనితం సుఖంగా, సంతోషంగా వుంటుంది, అలాగే ధనానికి లోటు వుండదు. ఈ గోమతి చక్రాలను ఉబ్బేత్తుగా వున్న వైపు క్రిందకి వుంచి నునుపుగా వున్న వైపు పైకి వుంచాలి. కొందరు వీటిని ఉబ్బెత్తుగా వున్న వైపు పైకి వుంచుతారు. ఇలా వాడటం ప్రయోజనం కాదని తెల్సుకోవాలి.
షిరిడి నాధుడు సాయిబాబా విజయదశమి రోజున మహాసమాధి చెందారు. విజయదశమి రోజున సాయి మహాసమాధి చెందే ముందు కొన్ని సూచనలు ఇచ్చారు. శరీరాన్ని వదిలటానికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన చేత బాబా రామ విజయం అనే గ్రంధాన్ని చదివించు కున్నారు. శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన సారాంశమే ఈ రామ విజయం. మొట్టమొదట వజే ఏడు రోజుల్లో రామ విజయం పారాయణం పూర్తి చేశాడు బాబా వారికి మళ్లీ శ్రీరాముడి కధ వినాలన్పించింది. వజే అనే అతనిని మళ్లీ రెండోసారి చదవమన్నాడు వజే రాత్రి పగలు చదివి మూడురోజుల్లో రెండవ పారాయణం పూర్తి చేస్తాడు వజే. బాబా వారికి మళ్లీ మళ్లి శ్రీరాముడి కధ వినాలన్పించింది, మరల బాబా అతనిని మూడోసారి చదవమంటారు. తాను మూడు రోజులు చదివి అలసిపోతాడు, అప్పుడు బాబా గారు అతనికి సెల విచ్చి పంపుతారు. ఎవరైనా శరీరాన్ని వదిలేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి వారి మత గ్రంధాలు చదవడం ఆనవాయితి. అలానే పరీక్షిత్ మహారాజుకు ముని కుమారుడు శృంగి శాపం వలన తక్షకుడి ద్వారా మరణం తప్పదని తెల్సినప్పుడు శుక బ్రహ్మ ఏడురోజులలో పరీక్షిత్ కు భాగవతం చెప్పి ఆయనను అనుగ్రహించాడు. బాబా పరమాత్మ అయినా సంప్రదాయాన్ని అనుసరించి రామవిజయ పారాయణ చేయించారు. బాబా చివరిక్షణం వరకు అనేక సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పారు. దేహం పడిపోటానికి రెండు మూడు రోజుల ముందు భిక్షకు వెళ్లడం మానేశారు. కాకా సాహెబు దీక్షిత్ మరియు శ్రీమాన్ బూటీగారు ద్వారకామాయిలోనే భోజనం చేసేవారు. 1918 అక్టోబర్ 15 వతేది నాడు బాబా వారిని వాడా కు వెళ్లి భోజనం చేయమని ఆజ్ఞాపిస్తారు. అక్కడ ఇంకా లక్ష్మి బాయి, భాగోజి షిండే, భయ్యాజీ, బాలా షిమ్పే మరియు నానాసాహెబ్ నిమోన్కర్, శ్యామా ఉంటారు. లక్ష్మి బాయికి తొమ్మిది నాణాలు ఇచ్చిన తరువాత బాబా ఇలా అంటారు మసీదులో తనకు బాగాలేదని, తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకు పోయిన బాగుండునని చెప్పారు. ఇలా అంటూ భయ్యాజీ మీదకు ఒరిగి ప్రాణములను విడుస్తారు. భాగోజి ఈ విషయం నిమోన్కర్కు చెప్పగా, ఆయన బాబా నోటిలో కొంచెం నీరు పోస్తే అది కాస్తా బయటకు కారిపోతుంది. అప్పుడు నిమోన్కర్కు దేవా! అంటూ ఆర్తితో పిలవగా బాబా మెల్లగా “ఆ” అని కల్లుతెరచి చూసి ఇక తరువాత తమ భౌతిక శరీరం వదిలివేస్తారు. బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు బాబా ఎప్పుడు తన దగ్గరే ఉంచుకొని అపురూపంగా చూసుకునే ఇటకరాయి రెండు ముక్కలు అవుతుంది. మసీదును శుభ్రపరిచే ఒక పనికుర్రవాడు పొరపాటున ఆ ఇటకరాయిని శుభ్రం చేస్తూ క్రింద పడవేస్తాడు. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది. బాబా వచ్చి ఈ విషయం తెలుసుకొని ఇది ఇటుక కాదు. నా అదృష్టమే ముక్కలు అయి పోయినది. అది నా జీవితపు తోడూనీడ. దాని సహాయం వలననే నేను నిత్యం ఆత్మానుసంధానము చేసేవాడిని. ఈ రోజు అది నన్ను విడిచినది అని అన్నారు. ఈ ఇటుకపై బాబాకు ఇంత ప్రేమా అని మనకి సందేహంకలుగవచ్చు. కాని దీని విషయం బాబాకే తెలియాలి. వారు సుద్ద చైతన్యులు. వారికి ఈ అశాశ్వతమైన వాటి మీద మమకారం ఉండదు. ఈ ఇటుక గురు భక్తికి ప్రతీకగా కొందరు చెప్తారు. ఇక అప్పటికే షిర్డీ అంతా బాబా మహాసమాధి చెందిన వార్త తెలిసి ప్రజలు అందరు అక్కడకు వస్తారు. వారందరిలో తరువాత జరుగవల్సిన కార్యక్రమం పై చర్చలు జరిగాయి. ఎలా సమాధి చేయాలి అనే అంశం మీద చర్చ జరిగింది. ముస్లిం భక్తులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి గోరి కట్టాలి అని నిర్ణయించారు. కాని రామచంద్ర పాటిల్ మిగిలిన గ్రామస్థు లందరితో కలిసి బాబావారిని వారు కోరిన విధంగా బూటీ వాడాలో ఉంచాలి అని తీర్మానించారు. ఈ రెండు వాదనల ఎటు తేలకపొతే అందరిలో కలవరపడ్డారు. అప్పుడు కొందరు అధికారులు వచ్చి ఈ విషయమై ఎన్నిక జరగాలి అని నిశ్చయించితే ఎక్కువ ఓట్లు బాబా కోరిన దాన్నే బలపరుస్తాయి. అప్పుడు బూటీ వాడాలో ఎక్కడైతే మురళీధరుని ఉంచాలి అనుకున్నారో అదే స్థానంలో బాబా శరీరాన్ని ఉంచుతారు. ఇక్కడ నిమోన్కర్కు గారు ఆశ్ఛర్యకరమైన విషయం చెప్పారు. బాబా శరీరం 36 గంటల తరువాత కూడా ఏమి పాడవకుండా ఉంది. ఆయన కఫినీని చింపకుండా తీయగలిగారు. బాలాసాహెబ్ భాటే, ఉపాసినీ బాబా కలిసి జరగవలిసిన కార్యక్రమాలు దగ్గర ఉండి పూర్తి చేశారు. జీవన్ముక్తు లైనవారికి ప్రాపంచిక పరంగా అందరి లాగా భౌతికమైన ఆలంబన ఉండదు. కాని అందరి లాగా వారు ప్రవర్తించవచ్చు. బాబావున్నప్పటి నుంచి షిరిడిలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించేవారు.





Total views : 146808