పంచారామ క్షేత్రమైన పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో శివ పూజలు చేస్తే మోక్ష మార్గమని భక్తులు విశేషంగా విశ్వసిస్తారు. అలాగే శివుని ముందు దీపం వెలిగించడం పాప విముక్తి, ఆత్మ మోక్షానికి మార్గమని చెబుతుంటారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్తీక స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి భక్తిశ్రద్దలతో పూజలు చేస్తున్నారు.
Devotional
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేనివిధంగా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత గంగమ్మ తల్లిని భూమన కరుణాకర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మమత స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేపట్టారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, దొడ్డారెడ్డి ముని శేఖర్ రెడ్డి, తొండమనాటి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
Read Also..
అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం, మేము పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి మూల సిద్ధాంతం తోనే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లి, రాయచోటి డివిజన్ డిఎస్పి మహబూబ్ బాషా, అర్బన్ సి సుధాకర్ రెడ్డి, టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి మణికంఠ గిరి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాల ధారణ ధరించిన అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనార్టీ ఆకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లీ తోపాటు రాయచోటి నియోజకవర్గం టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. వీరికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అతిథులుగా హాజరైన వారికి స్వామి వారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురుస్వాములు బసిరెడ్డి సురేష్ జయశంకర స్వాములను శాలువాలతో సన్మానించి పూలమాలతో సత్కరించారు. అదేవిధంగా అతిథులుగా హాజరైన వారిని కూడా అయ్యప్ప స్వాములు ఘనంగా సన్మానించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కఠినమైన, దీక్ష నియమములతో అయ్యప్ప స్వామి మాలధారణ ధరించడం చాలా అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా సోదరుల వలె కలిసి మెలగాలన్నారు. ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటూ సాంప్రదాయ పండుగలను నిర్వహించుకోవాలన్నారు. దాతల సహకారంతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసి మాల ధారణ ధరించిన స్వాములకు వసతి సౌకర్యాలతో పాటు బిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఆలయ నిర్వాహకులకు తమ పరిరక్షణ సమితి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్, మీడియా కోఆర్డినేటర్ అన్వర్, అయ్యప్ప స్వాములు తదితరులు హాజరయ్యారు.
Read Also..
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్బంగా.. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి వేలాది మంది తరలి వచ్చారు. ఉదయమే పవిత్రమైన ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి వెళ్లి స్వామివారు ను దర్శించుకున్నారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కును చెల్లించారు. ఆలయంలో రద్దీతో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.
Read Also..
రాయచోటిలోని సుద్దల వాండ్ల పల్లి రోడ్డు మార్గంలో వెలిసిన మణికంఠ గిరి అయ్యప్ప స్వామి దేవాలయం లో శుక్రవారం రాత్రి సురేష్ రెడ్డి, సాయి కుమార్ యాదవ్, గంగిరెడ్డి స్వామి ల అధ్వర్యంలో అంబులం పూజ నిర్వహించారు.ఆలయ ధర్మ కర్త, గురు స్వామి అయిన బసిరెడ్డి స్వామి శాస్త్రోక్తంగా అయ్యప్ప స్వామికి అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు.అంబులం పూజ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం భక్తులను బాగా ఆకట్టుకొంది. అయ్యప్పకు వినాయకునికి, సుబ్రమణ్యం స్వామి విగ్రహాలు ప్రత్యేక అలంకరణ చేశారు.అయ్యప్ప స్వామి గురు స్వాముల భక్తి పాటలతో మణికంఠ గిరి పులకరించింది. అంబులం పూజలో ఏర్పాటుచేసిన 18 మెట్ల మండపం అయ్యప్ప స్వామి భక్తులను ఎంతగానో ఆకర్షించింది. పూజ అనంతరం కార్యక్రమం నిర్వహించిన కుటుంబ సభ్యులు స్వాములకు బిక్ష ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
కడప జిల్లా.. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రొద్దుటూరు లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ప్రొద్దుటూరు లోని ప్రసిద్ధ ఆగస్తేశ్వర ఆలయం, పెన్నా నది తీరాన రెండవ కాశీగా పేరుగాంచిన శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయాలలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్బంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శివ సన్నిధిలో బారులు తీరారు. మహిళలు ఎంతో నిష్టతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు చేశారు. గర్భాలయంలోని శివ లింగానికి ఏకవార రుద్రాభిషేకం, ఉత్సవమూర్తులకు అభిషేకం, రుద్ర హోమం నిర్వహించారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని నగరంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండి భక్తులు పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు, విశిష్ట పూజలతో తమ భక్తిని చాటుకున్నారు. 100 ఏళ్లు చరిత్ర గల విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఆ పరమశివుడికి నిత్య పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించామంటున్న విశ్వేశ్వర స్వామి గుడి ప్రధాన అర్చకులు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు రథం పై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.





Total views : 146880