అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన కోటి అక్షంతలు ఊరేగింపు కార్యక్రమం మార్కాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 22న కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అయోధ్య నుంచి మార్కాపురం పట్టణానికి వచ్చినటువంటి స్వామి వారి తలంబ్రాల అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద నుండి డప్పు కోలాట చప్పుళ్ల మధ్య అక్షింతల కలశాలతో శోభాయాత్రను నాలుగు మాడవీధులలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వహిందూ పరిషత్తు అఖిల భారత ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులు గారు విచ్చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం రామచంద్రుని 600 సంవత్సరాల కల నేటికి తీరిందని ఈ యొక్క పవిత్రమైన అక్షింతలను జనవరి రెండవ తేదీ నుండి పట్టణ మరియు పరిసర ప్రాంతం గ్రామాలలో ప్రతి ఇంటికి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు మరియు స్వామివారి రూపం, ఫోటోలను, ప్రతి గడపకు చేరవేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని 22వ తేదీ ప్రాణ ప్రతిష్ట రోజున ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి భక్తిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు, పలు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Devotional
భక్తుల నుండి అనధికారికంగా కేశఖండనశాల వద్ద ఆలయ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కేశఖండన కు 40 రూపాయల టికెట్‌ను పెట్టగా.. ఆలయ సిబ్బంది భక్తుల దగ్గర అదనంగా 50 రూపాయలు నుండి 100 రూపాయిల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న అడగలేని నిస్సహాయ స్థితిలో భక్తులు, పట్టించుకోని దేవాదయ శాఖ ఉన్నతాధికారులు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం లోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి వారు స్వయంభు, 18వ తేదీ సోమవారం తెల్లవారుజాము నుంచి సృష్టికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి షష్టికి 40 వేల పైబడి భక్తులు వస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈవో జోగా సత్యనారాయణ తెలిపారు. స్వయంభు దేవాలయం కావడంతో భక్తులు సంఖ్య ఏటేటా పెరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు దత్తు తెలిపారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారని ఆయన వెల్లడించారు.
Read Also..
తిరుమలలో చిరుజల్లులు కురుస్తుండడం, సీతాకాలం కావడంతో తిరుమల వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. ఓ వైపు చల్లని చలి గాలులు వీస్తున్నాయి. మరోవైపు పొగ మంచి తిరుమలను దట్టంగా కప్పేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా, ఆనందంగా సంతోషాన్ని నింపుతుంది. చిరుజల్లులు, పొగ మంచు, చలి ఇలా ఊటీని సైతం మించిపోయేలా ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల లో వాతావరణం ఈ విదంగా ఉండడంతో భక్తులు తన్మయంతో ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. మరో వైపు ఘాట్ రోడ్లలో కూడా పొగ మంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి అంటు టీటీడీ సూచన చేస్తుంది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వీర్రాజు మావిడి వద్ద వెలసిన శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకల్లో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని పలనిమలై లో నిర్వహించే వేల్ కావిడిఉత్సవం గత పది సంవత్సరాలుగా అనపర్తి గ్రామంలో వీర్రాజు మామిడి కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. 226మంది సుబ్రమణ్య స్వాములు మాలలు ధరించి భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పురవీధుల్లో నృత్యాలు చేస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని దర్శించేందుకు భక్తులు గ్రామస్తులు అడుగడుగున హారతులు పడుతూ స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అదేవిధంగా సోమవారం జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగు చర్యలు కమిటీ నుండి చేపట్టామని భక్తులందరూ స్వామివారి దర్శనార్థం వీర్రాజు మావిడికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వలసిందిగా ఆలయ కమిటీ భక్తులను కోరింది.
Read Also..
నదిలో నాణేలు వేయడం అనేది భారతదేశంలో చాలా ప్రాచీనమైన ఆచారం. ఈ ఆచారం గురించి అనేక కథలు మరియు నమ్మకాలు ఉన్నాయి. కొంతమంది ఈ ఆచారం పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు, మరికొందరు ఇది మాత్రమే ఒక సంప్రదాయం అని నమ్ముతారు.
పుణ్యం ఇస్తుంది అనే నమ్మకం
పుణ్యం ఇస్తుంది అనే నమ్మకం ప్రకారం, నదిలో నాణేలు వేయడం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది. ఈ పుణ్యం వల్ల మన జీవితంలో మంచి జరుగుతుంది. మనకు సుఖం, శాంతి, సంపద లభిస్తుంది.
ఈ నమ్మకానికి కొన్ని మతపరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. హిందూ మతంలో, నదిని దేవతగా పూజిస్తారు. నదిని పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. నదిలో నాణేలు వేయడం వల్ల నది దేవతకు సమర్పించడం లాంటిదిగా భావిస్తారు.
సంప్రదాయం మాత్రమే అనే నమ్మకం
సంప్రదాయం మాత్రమే అనే నమ్మకం ప్రకారం, నదిలో నాణేలు వేయడం అనేది ఒక సంప్రదాయం మాత్రమే. ఈ ఆచారం చాలా పురాతనమైనది. ఈ ఆచారం ద్వారా నదిని పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ నమ్మకానికి కొన్ని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. పురాతన కాలంలో, నదులను దేవుళ్ళు లేదా దేవతల నివాసంగా భావించేవారు. నదులను పవిత్రమైన ప్రదేశాలుగా భావించేవారు. నదులను పవిత్రంగా ఉంచడానికి, వాటిలో నాణేలు వేయడం వంటి అనేక ఆచారాలు ఉన్నాయి.
అసలు కారణం
నదిలో నాణేలు వేయడానికి అసలు కారణం ఏమిటో ఖచ్చితంగా చెప్పలేము. అయితే, ఈ ఆచారం పురాతనమైనది మరియు దీనికి అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ ఆచారం ద్వారా నదిని పవిత్రంగా ఉంచడానికి లేదా పుణ్యం పొందడానికి ప్రయత్నిస్తున్నారని భావించవచ్చు.
ఆయ్యప్ప భక్తుల తాకిడితో శబరిమల గిరులు నిండిపోయాయి. 19గంటల పాటు మణికంఠుని దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
నవంబర్ 17నుండి అయ్యప్ప దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం అనుమతినివ్వటంతో భక్తుల సందడి ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అయ్యప్ప భక్తులు మణికంఠుని దర్శించుకునేందుకు దీక్షలు చేపట్టారు. శబరిమలలో యాత్రికుల రద్దీ అదుపు తప్పుతున్న నేపథ్యంలో హైకోర్టు కఠిన చర్యలు తీసుకుంది. బుకింగ్ లేకుండా శబరిమలలోకి ఎవరినీ అనుమతించరాదని హైకోర్టు ధర్మాసనం దేవస్థానంను ఆదేశించింది. వర్చువల్ బుకింగ్, స్పాట్ బుకింగ్ లేకుండా ఎవరూ ప్రయాణించకూడదని కోర్టు కోరింది. శబరిమల వద్ద భక్తులకు సహాయం చేసేందుకు సమీపంలోని కళాశాలల ఎన్ఎస్ఎస్, ఎన్సిసి క్యాడెట్ల సహాయాన్ని కోరాలని దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్‌లు, స్పాట్లో 30 వేల బుకింగ్స్ ఉంటున్నాయని అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. దర్శనాలను త్వరగా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు. అయ్యప్ప దర్శన సమయాలను ప్రతిరోజూ 19 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని టీబీడీ పేర్కొంది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పొడిగించింది. ప్రస్తుతం రోజుల్లో రెండో భాగంలో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరంనియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం. కార్తీకమాసం ఆఖరి రోజు కావడంతో మహిళలు భక్తిశ్రద్దలతో పోలిస్వర్గం కి సాగనంపుతారు. నెలమొత్తం ఎంతగానో ఉపవాసం, నోములు, వ్రతాలు చేసి తమ పసుపు కుంకుమ లు చల్లగా ఉండాలని పరమశివుని ప్రార్థిస్తూ నదిలో పుణ్య స్నానం చేసి దీపాలు వెలిగించి నదిలో వదిలి పూజలు ముగించుకుంటారు. విజయవాడ వన్ టౌన్ కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కృష్ణా నదిలో స్థానమాచరిస్తున్న భక్తులతో కిటకిటలాడుతున్న కృష్ణమ్మ.
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు, అంగరంగ వైభవంగా కార్తీక మాస వేడుకలు. దీపావళి అనంతరం దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది అనే విషయం అందరికీ తెలిసినదే ఇందులో భాగంగానే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హిందువులు ప్రతిరోజు శివుని ఆలయానికి వెళ్లి దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివునికి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలలో దీపాలతో దీపారాధన చేస్తారు. కొంతమంది 365 దీపాలతో మరి కొంతమంది లక్ష దీపాలతో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. ఈ కార్తీకమాసంలోనే హిందువులు వనభోజనాలకు వెళ్లి సరదాగా సంబరాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే రైల్వేకోడూరు పట్టణంలో నడిబొడ్డున వెలసి ఉన్న భుజంగేశ్వర స్వామి ఆలయంలో రైల్వే కోడూరు ఉపసర్పంచ్ తోట శివ సాయి సహకారంతో భుజంగేశ్వర ఆలయ చైర్మన్ పోకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కార్తీకమాసం మొదటి రోజు నుండి నేటి వరకు అనగా నెల రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో వేలాదిమంది భక్తులతో లక్షలాది దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేసి ప్రజలు తమ భక్తుని చాటుకున్నారు. ప్రత్యేకించి సోమవారాలలో అంగరంగ వైభవంగా పూజలు, అన్నదానాలు, భజన కార్యక్రమాలు, దీపారాధనలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. భుజంకేశ్వర ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో సుందరీకరంగా అలంకరించారు. నాలుగవ కార్తిక సోమవారం నాడు మిచౌంగ్ తుఫాన్ సైతం లెక్కచేయకుండా జోరు వానలో హోరుగా అన్నదానాలు, భజన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తులు పోటెత్తిపోయారు. కార్తీక మాసం పూలు పండ్లు, కాయ కర్పూరం లాంటి చిరు దుకాణాల వ్యాపారులకు కనక వర్షం కురిపించింది. ఏది ఏమైనప్పటికీ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో భుజంగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తిపోయారు. చివరి వారం కావడంతో ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తమ సతీమణి భుజంగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది రైల్వే కోడూరు ప్రజలు, వర్తకులు, రైతులు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థించాలని కొరముట్ల శ్రీనివాసులు తమ సతీమణి తెలియజేశారు.
శ్రీశైలంలో కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,దశ హారతులిచ్చారు కార్తికమాస చివరి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది ఈ లక్షదీపోత్సవంలో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు భక్తులు,ఆలయ సిబ్బంది కార్తీక దీపాలను వెలిగించారు రేపటి అమావాస్యతో శ్రీశైలంలో కార్తీక మసోత్సవాలు ముగుస్తాయి.





Total views : 146938