తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కరుణాకరరెడ్డి,ఈవో.ధర్మారెడ్డి , జై ఓ వీరబ్రహ్మం..పాల్గొన్నారు.
Devotional
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంలో దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేశారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ లో ఆలయ సాంప్రదాయ పద్ధతిలోనే ఇక్కడ కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం, భక్తుల కు ఎంతో ప్రీతిపాత్రమైన ముక్కోటి ఏకాదశి ని పురస్కరించుకొని మైలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వారదర్శనం లో కనువిందు చేసారు. తెల్లవారుజామున నుండి భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారదర్శనం లో వీక్షించేందుకు బారులు తీరారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్ద ప్రసాదాలు అందజేశారు.
తిరుమల ఉత్తర వాకిలి దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బారులు తీరిన భక్తులు. రాత్రి 10 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అర్ధరాత్రి దాటిన తర్వాత టోకెన్లు జారీ చేసిన టిటిడి. పది రోజులపాటు ఉత్తర ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ. టికెట్ కౌంటర్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు. తోపులాటలు తోక్కిసలాటలు జరగకుండా విజిలెన్స్, పోలీస్ అధికారుల సమన్వయంతో క్యూ లైన్ లో నికి భక్తులను అనుమతిస్తున్న అధికారులు.
గురువారం సాయిబాబాకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున సాయి దివ్య పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది.
పూజా విధానం
స్నానం చేసి, శుభ్రమైన దుస్తులను ధరించండి. సాయిబాబా చిత్రం లేదా విగ్రహాన్ని ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి. పూజా గదిని శుభ్రం చేసి, పూలు, అక్షతలు, కుంకుమ, అగరువత్తులు, దీపాలు, పండ్లతో అలంకరించండి. స్థానిక దేవుని పూజ చేసి, శుద్ధి చేసుకోండి. సాయిబాబా చిత్రం లేదా విగ్రహం ముందు నిలబడి, పాదపూజ చేయండి. “ఓం సాయియ్య నమః” అని 108 సార్లు జపించండి. సాయిబాబాకు పూలు, అక్షతలు, కుంకుమ, అగరువత్తులు, దీపాలు సమర్పించండి. పండ్లు, నైవేద్యం సమర్పించండి.
తిరుమల. శ్రీవారి ఆలయంలో శాస్త్రోకంగా ముగిసిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేసిన ఆలయ అర్చకులు, అధికారులు. టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కామెంట్స్. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయాన్ని శుద్ది చేశాం. ఏడాదికి నాలుగు పర్యాయాలు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. వివిధ సుగంధ పరిమళాలు కలిగిన ఈ లెపనం తో ఆలయ గోడలను శుద్ది చెయ్యడం జరిగింది. తద్వారా ఆలయ గోడలకు ఎలాంటి ముప్పు ఉండదు. వేలాది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించాం.
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం సోమవారం నాడు భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని తరించారు. తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా లఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్లో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. అనుబంధాలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. వందలాది మంది భక్తులు బద్దిపోచమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
నంద్యాల మండలం సుగలిమెట్ట వద్ద పోలంలో బయటపడిన అమ్మవారి విగ్రహం. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మహనంది దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని చెవిలో చెప్పిన అమ్మవారు. గత రెండు రోజుల నుండి వెతుకగా సుగాలిమెట్ట వద్ద బయటపడ్డ అమ్మవారి విగ్రహం. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో కోలాహలంగా మారిన సుగాలిమెట్ట ప్రాంతం. అమ్మవారిని దర్శించుకుని పూజలు టెంకాయలు అర్పిస్తున్న భక్తులు….
సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలను సోమవారం కొత్తపేట నియోజకవర్గం లో వాడ వాడలా ఘనంగా నిర్వహించారు.భక్తులు వేకువ జామున నుంచే ఆలయాలకు చేరుకొని స్వామిని దర్శించుకుని పూలు,పడగలు సమర్పించుకున్నారు.పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి.ముఖ్యంగా కొత్తపేట మండల పరిధిలోని వాడపాలెం లో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారు జామున నుండే స్వామి వారికి ప్రధాన అర్చకులు శ్రీను,మణి,సాయి గార్ల చే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అత్యధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామి వారిని దర్షించుకున్నారు.అలాగే కొత్తపేటలో పురాణ ప్రసిద్ది చెందిన హరి హర దేవాలయం ప్రాంగణంలో గల వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయాల వద్ద రద్దీ ఎక్కువవడంతో భక్తుల క్యూ లైన్లుతో ఎక్కడికక్కడ బారులు తీరారు.నియోజకవర్గం లోని పలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.మండలం లో ఆయా ఆలయాల వద్ద షష్ఠి తీర్థాలు ఘనంగా నిర్వహించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ సోమవారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,మంచినీరు అందిస్తున్నారు.





Total views : 146999