అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఏలూరులో ధర్మబేరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఉదయం నుండి హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం యాగ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలతో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొని అయోధ్య లోని బాలరామ విగ్రహ ప్రతిష్టకు సంఘీభావం తెలిపారు.
Devotional
కాకినాడ, కళ్ళు చేదిరేలా కాకినాడ శోభాయాత్ర. కాకినాడ నగరం వేలాది మంది మార్వాడీలతో కళకళ లాడింది. గుజరాత్ కి చెందిన వందలాది మంది మార్వాడి మహిళలు, యువత, యువకులు ఆనందంగా శోభాయ మానం గా నృత్యాలు చేస్తూ అయోధ్యరామునికి స్వాగతం పలికారు. నగరంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నాయి. వారెవరు చేయని విధంగా మార్వాడీలు అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి ఆయోద్యకే పేరు తెచ్చేలా అందరి మన్ననలు చూరగొన్నారు.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీ సీత రాముల ఉత్సవ విగ్రహాలను సోమవారం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభక్తులు ఆర్యవైశ్య మహిళ మండలి కమిటీ సభ్యులు కోలాటం చేస్తూ రామనామం జపిస్తూ నృత్యాలు చేస్తూ కోటలోని కోదండ రామస్వామి ఆలయం వరకు కాషాయ జెండాలు పట్టుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు. పురవీధులు రామనామంతో మారుమోగాయి. అనంతరం కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తాదులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. మధ్యాహ్నం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తాదులకు ఆలయం వద్ద భోజన వసతి ఏర్పాటు చేశారు.
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం అయోధ్య శ్రీ రామయ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ముమ్మిడివరం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గ్రామోత్సవం. వేకువజామునే బాజా భజంత్రీలు, భజనలతో ఉమా సూరేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి శ్రీ సీతారామ స్వామివారిని పల్లకీ సేవగా ప్రారంభమై ముమ్మిడివరం లో పలు రామాలయాల మీదుగా రామనామా సంకీర్తనలతో ముమ్మిడివరంలో సాగిన గ్రామోత్సవం. పాల్గొన్న భక్తులు..
నంద్యాల జిల్లా, నేటి నుండి ఈ నెల 12 నుండి 18 వరకు శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. శ్రీ స్వామి వారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు బ్రహ్మోత్సవాలలో భాగంగా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 18 వరకు రుద్ర,చండీహోమం, కళ్యాణం, ఏకాంతసేవ నిలుపుదల.
శ్రీకాకుళం, ఆరోగ్య ప్రదాత, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని ఇంద్ర పుష్కరిణి వద్ద సామూహిక సూర్యనమస్కారముల కార్యక్రమం ఘనంగా జరిగింది. వందలాది మంది జిల్లాలో ఉన్న యోగా విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జిల్లాలోని అరసవల్లి ఆలయ ప్రాంగణంలో అధికారులు, యోగా మాస్టర్లు ఆధ్వర్యంలో సూర్యనమస్కారములు నిర్వహించారు. 12 సెట్లగా విద్యార్ధినీ విద్యార్ధులు సూర్యనమస్కారములు చేశారు. ఒక్క సూర్యనమస్కారములే కాకుండా వివిధ రకముల యోగాసనాలను చేశారు. ఆర్ట్ ఫుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయుష్ శాఖ అధికారి అన్నారు. మకర సంక్రాంతి పండగను పురష్కరించుకొని సూర్యనమస్కారముల కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, యోగా విద్యార్ధులు పాల్గొన్నారు. మొత్తం 5 సెషన్స్ గా నిర్వహించడం జరిగిందన్నారు.
మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడించిన యువకులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఆందోళన చేస్తున్న యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి. అరెస్ట్ చేసిన యువకుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుంది అని సరైన బుద్ధి చెబుతామని యువకులు అన్నారు. దాదాపు 100 మందికి పైగా యువకులు ఒక్కసారిగా బొత్స క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. మెగా డీఎస్సీ తో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ డిమాండ్. సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన యువజన సంఘం నాయకులు.
అనకాపల్లి జిల్లాలో మందు తాగి రెచ్చిపోయిన విద్యార్థులు. బాలుర వసతి గృహంలో వెలుగులోకి 7వ తరగతి విద్యార్థుల బాగోతం. చోడవరం బిసి బాలుర వసతి గృహంలో మితి మీరిన న్యూ ఇయర్ సెలబ్రేషన్. మద్యం మత్తులో చిందులేసిన మైనర్ విద్యార్థులు. మందలించిన హాస్టల్ ముందు ఉంటున్న AC మెకానిక్. తప్పు అని మందలించిన వ్యక్తిపై విద్యార్థులు మూకుమ్మడి దాడి. పత్తాలేని హాస్టల్ వార్డెన్. చోద్యం చూస్తున్న చోడవరం పోలీసులు.
అన్నమయ్య జిల్లా రాయచోట, తెదేపా తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యుడి స్వయానా బావమరిది ద్వారక నాథ్ రెడ్డి. ఆయన తండ్రి అయినా రామ సుబ్బారెడ్డి 1978 కాంగ్రెస్ పార్టీ తరపున లక్కిరెడ్డీ పల్లి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ద్వారక నాథ్ రెడ్డి 1994 లో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో తెదేపా తరపున టికెట్ ఇవ్వకపోవడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2009 లో టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 వైసీపీ తరపున టికెట్ ఆశించారు. 2019 లో వైసీపీ, తేదేపా టికెట్ ఆశించినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ద్వారకా నాథ్ రెడ్డి. గత కొన్ని రోజులుగా తెదేపా టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. ఈ రోజు విజయవాడ కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభలో తారకరత్న అత్త ,అలేఖ్య రెడ్డి అమ్మ,ద్వారక నాథ్ రెడ్డి అక్క హరమ్మ సమక్షంలో పసుపు కండువా వేసుకొనున్నట్లు ఆయన అనుచరవర్గం వెల్లడించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వరుసగా సెలవులు రావడంతో భారీగా పెరిగిన భక్తుల రద్దీ పెరగడంతో క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. వరుసగా సెలవులు రావడంతో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.





Total views : 147066