తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. వల్లివేడు పంచాయతీ పరిధిలో మామిడి తోటలపై విరుచుకు పడుతూ పంట నష్టానికి పాల్పడుతున్నాయి. అంతే కాకుండా ఏనుగుల గుంపు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళవారం ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మామిడి చెట్లను పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. పంట నష్ట తీవ్రతను అంచనా వేయాలని సూచించారు. అనంతరం వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద ప్రజలు, బాధిత రైతులతో మాట్లాడారు. 10 ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో వచ్చి పంటను నష్టపరచడం ఇది మూడవ సారి అని తెలిపారు. కర్ణాటక సరిహద్దుల నుంచి ఏనుగుల గుంపు వస్తోందని, ఏ క్షణాన్నైనా గ్రామం వైపు వస్తాయేమోనన్న భయం నెలకొందని వారు తెలిపారు. అటవీ సరిహద్దు ప్రాంతాలైపైన అటవీ శాఖ అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరారు. వెంటనే చిత్తూరు, తిరుపతి జిల్లాల డీఎఫ్ఓ అధికారులతో మోహిత్ రెడ్డి మాట్లాడారు. అత్యవసరంగా చర్యలు చేపట్టాలని కోరారు. అధైర్య పడకండి.. ఐకమత్యంగా మెలిగి ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఏనుగుల గుంపును తరిమేద్దామని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం వేళల్లో పంట పొలాలకు వెళ్ళరాదని సూచించారు. ఏనుగులు కంట పడితే వెంటనే సంబంధిత పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఏనుగుల గుంపును త్వరితగతిన తరలింపునకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
herd of elephants
చిత్తూరు జిల్లా వి.కోట, పలమనేరు నియోజకవర్గములోని వి.కోట మండలంలో 14 ఏనుగుల గుంపు హల్చల్. నిన్న రాత్రి సుమారు 7 గంటల నుంచి పంట పొలాలపై స్వైర విహారం చేసిన ఏనుగుల గుంపు. ఉదయం తిరిగి అడవిలోకి వెళ్లిన ఏనుగులు. అటవీశాఖ అధికారులు ఏనుగుల మందను తరిమే ప్రయత్నంలో విఫలం అయ్యారు. గత రెండు రోజులుగా పంట పొలాలను తొక్కి ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు. పలు గ్రామాల్లో అరటి,రాగి,టమోటా పంటలు పూర్తిగా ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు. వి.కోట మండలం వెర్రినాగేపల్లి గ్రామంలో వరి..అరటి..బీన్స్..మామిడి..తోటలపై ఏనుగులు దాడి సుమారు పది లక్షల ఆస్తి నష్టం. ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదని రైతుల ఆందోళన.
చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో ఏనుగులు గుంపు భీభత్సం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే కడతట్లపల్లి గ్రామానికి చెందిన మహిళ రైతు వరలక్ష్మి గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది. తన మూడు ఎకరాల పొలంలో అరటి తోట వేసి,ప్రకృతిలో దొరికే ఆకుల జీవామృతంతో పిచికారీ చేసి పంట దిగుబడి చేసింది. రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరణం అసన్నమైoది.కానీ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు వరలక్ష్మి కి ఆశలు ఆవిరినాయి. ఒక్కసారిగా సోమవారం రాత్రి ఏనుగులు గుంపు అరటి తోటలో పడి భీభత్సం సృష్టించాయి. తెల్లవారి చూసే సరికి నేలమట్టంలో అరటి గెలలు దర్శనం ఇచ్చాయి.సంవత్సర కాల పంటలు సాగుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. సంవత్సరాలుగా పంటలు చేస్తున్నాం, కోత దశ వచ్చే సరికి ఏనుగులు చొరబడి నష్టం చేకురుస్తున్నాయి.కానీ 4 సంవత్సరాలుగా నష్ట పరిహారం ఒక్కరూపాయి కూడ చేకూర్చిన దాఖలాలు వైకాపా ప్రభుత్వంలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తెదేపా ప్రభుత్వంలో నష్ట పరిహారం అందినది. నాటిని మొలకలకు కూడా 30 వేలు ఆర్థికం అందినదని హర్షం వ్యక్తం చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్క రూపాయి కూడ నష్ట పరిహారం అందలేదు..ఇప్పుడున్న మా పరిస్థితి చూసి మాకు నెలకొన్న సమస్యను చూసి నష్ట పరిహారం ఇవ్వాలని సుమారు రెండు లక్షలు నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేసింది.





Total views : 147264