హైదరాబాద్లో విద్యాశాఖ వారం రోజుల విద్యావారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ బడుల అభివృద్ధి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈనెల 17 వరకు వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలను హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థకు సంబంధించి రూ.1,100 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యావ్యవస్థలోనూ తెలంగాణ ప్రాంతం దశాబ్దాలుగా వివక్షకు గురైందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పేద బడుగు బలహీన వర్గాలకు సైతం నాణ్యమైన విద్యను అందించేలా ప్రణాళికలు రచించి అమలు చేస్తున్మామన్నారు
Tag:





Total views : 75006