తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు పవన్ కల్యాణ్(Pawan Kalyan) హాజరయ్యారు. కూటమిలో బలమైన నాయకత్వం ఉందని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు(Chandrababu), మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) వంటి నేతలు కూటమిలో ఉన్నారని వివరించారు. ముఖ్యంగా, మీ కష్టాలను మోస్తున్న నేనున్నాను అని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడికి వెళ్లినా కూటమి ప్రభుత్వం వస్తుందని ప్రజలే చెబుతున్నారని వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రజలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని కులాలకు ద్రోహం చేస్తోందపి ఆరోపించారు. యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుకోవద్దని సూచించారు. సుమారు 70 కోట్ల వరకు ట్యాక్స్ కట్టాను. దాచిపెట్టేవాడ్ని కానని జనసేనాని తెలిపారు. సుఖాలను వదులుకుని రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నానంటే… ప్రజల పక్కన అండగా నిలబడేవారు ఎవరు? చంద్రబాబు గారు జైల్లో ఉంటే ధైర్యంగా వెళ్లింది ఎవరు? ఆ ధైర్యం జనసేనకే ఉంది, పవన్ కల్యాణ్ కే ఉందని జనసేనాని తెలిపారు.
- ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్ .కార్పొరేట్ పాఠశాలలకు మేమేం తక్కువ కాదంటూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఘన సత్కారం లభించింది. సికింద్రాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాప్‌గా నిలిచిన 100 మంది…
- అత్యంత ప్రతిష్ఠాత్మకం ఏపీలో యోగాంధ్ర-2026.ఏపీలో యోగాంధ్ర-2026ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జూన్ 7 నుంచి 14 రోజులు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణపై ఉండవల్లి నివాసంలో మంత్రులు, అధికారులతో సమీక్షించారు.యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను…
- రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ..రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని క్రీడల , రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90176