కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది. 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది. భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ప్రజాప్రయోజనం స్పష్టంగా నిరూపించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. సామాజిక ప్రభావం అంచనా నివేదిక తమకు ఇవ్వలేదన్నారు. అభ్యంతరం చెప్పే అవకాశం తమకు హైకోర్టులో ఇవ్వలేదని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. భూసేకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది.
Tag:





Total views : 62186