ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయమైన అమ్మవారి ఆలయం. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం. అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్లో ఉంది. కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెబుతున్నారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయల్పడ్డాయి. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం అమ్మవారి ఆలయం. మరి భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతనఆలయాలలో ఇది ప్రధమంగా పేర్కొవచ్చు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం. ఈ ఆలయం ముండేశ్వరి అనే పర్వతం మీద వుంటుంది. ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమ శివుడిని కూడా పూజిస్తారు. దీనిని భారతదేశంలోని పూజాదికాలు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చు. దుర్గా దేవి వైష్ణవి రూపంలోఇక్కడ ముండేశ్వరి మాత దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహన మహీషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది. దీనిని 100ఏడి లో నిర్మించారు. అంతకంటే ముందు దానిని 105 ఏడి లో నిర్మించి ఉంటారని దీనికి సంబంధించినవి ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది. ఈ ఆలయం నగరశైలిలో నిర్మించబడి వుంది. ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో ఎద్దు పైన స్వారీ మహిషాసురమర్ధిని రూపంలో వుంటుంది. ఇక్కడ శివుడు కూడా 4ముఖాలతో వుంటాడు. రెండు రాతితో చేసిన పాత్ర ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి. ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా వున్నాయి. ఆ కాలం నుండి ఇక్కడ పూజాదికాలనేవి కొనసాగుతూ రావడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శతాబ్దాలు మారినా పూజ కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
Lord Vishnu
అస్సాం రాష్ట్రంలో ఒక అద్భుతమైన ద్వీపం ఉంది. దీని విశేషాలు తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ ద్వీపంలో పర్వమేశ్వరుడు తన మూడవ కన్ను తెరిచినట్లు చెబుతారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. అద్భుతమైన ప్రకృతి అందాలను అన్వేషించేందుకు ఈశాన్య భారతదేశం మీకు గొప్ప అవకాశాలను అందిస్తుంది. పచ్చదనంతో నిండిన పర్వతాలు, రాతి మార్గాలు, రంగులతో మెరిసే వాతావరణం, బ్రహ్మపుత్ర నది, దాని సహజ అందాలు మీకు మరచిపోలేని అనుభవాలను పంచుతాయి. ఈ ప్రాంతంలో ప్రకృతి వికాసం అందమైన ఛాయాచిత్రాల మాదిరిగా వైభవంగా కనిపిస్తుంది. ఈశాన్య భారతదేశం అన్ని కాలాల్లో పర్యటించదగ్గ అద్భుతమైన ప్రదేశం. కాబట్టి వింటర్ లో విరామం కోరుకునే వారు ఎక్కడికి వెళ్లాలో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది. ఈశాన్య ప్రాంతం సాహసాలకు కూడా స్వర్గధామం వంటిది. ప్రాచుర్యం పెద్దగా లేని కొన్ని అద్భుతమైన రహస్య ప్రదేశాలు ఇక్కడి పర్యాటకంలో ప్రత్యేక ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది అస్సాంలోని ఉమానంద ద్వీపం. గొప్ప చారిత్రక, పురాణ ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రదేశం టూరిస్టుల దృష్టికి దూరంగా ఉంది. వాస్తవానికి ఇది ప్రపంచంలోనే అతి చిన్న నివాస ద్వీపం. ఈ నదీ ద్వీపంలో ఉన్న శివాలయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఉన్న 5 ప్రముఖ దేవాలయాల్లో ఇది ఒకటి. కామాఖ్య ఆలయాన్ని సందర్శించడానికి ముందుగా ఈ ఆలయాన్ని సందర్శించాలని భక్తుల నమ్మకం. బ్రిటిషర్లు ఈ ద్వీపాన్ని నెమలి ద్వీపం అని పిలిచేవారు. ఎందుకంటే ఇది నెమలి ఫించాల ఆకారాన్ని పోలి ఉంటుంది. ఎన్నో పురాణ గాధలు కూడా ఈ అరుదైన ప్రదేశం చుట్టూ అల్లుకుని ఉన్నాయి. పురాణ గాధల ప్రకారం ఉమానంద ద్వీపాన్ని ‘భస్మాచల్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు కామ దేవుణ్ణి తన మూడవ నేత్రంతో భస్మం చేశాడు. భస్మ అంటే బూడిద, చల్ అంటే స్థలం కామదేవుడు భస్మమైన ప్రదేశం కాబట్టి దీనికి భస్మాచల్ గా పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ ద్వీపానికి మరో పురాణ కధనం కూడా ఉంది. పరమేశ్వరుడు తన సతీమణి పార్వతితో కలిసి ఇక్కడ నివాసం ఉండేవాడు. పార్వతి దేవిని ఉమాదేవి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ ప్రాంతానికి ఉమానంద అని పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ ద్వీపం మునిగితే గౌహతి నీట మునుగుతుంది. ప్రసిద్ధ జానపద కధల ప్రకారం బ్రహ్మపుత్రను శివుని సేవకుడిగా పేర్కొంటారు. అస్సాంలో ఇటీవల కాలంలో బ్రహ్మపుత్ర నది కారణంగా అనేక సార్లు వరదలు సంభవించినా ఈ నదిపై ఉన్న ఉమానంద ఆలయంలోకి మాత్రం నీరు చేరలేదు. ఉమానంద ద్వీపం ఎప్పుడు నీట మునుగుతుందో అప్పుడు గౌహతి నగరం కూడా నీట మునుగుతుందని నమ్ముతారు. ఆలయ నిర్మాణం శివ భక్తుడైన గదాధర్ సింఘా అనే రాజు ఇక్కడ శివాలయాన్ని నిర్మించాడు. 1897లో ఏర్పడిన భూకంపానికి ఈ ఆలయం శిధిలమైంది. ఆ తరువాత ఒక స్థానిక వ్యాపారిచే దీనిని పునఃనిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో వినాయకుడు, విష్ణువు, సూర్య భగవానుడు, పార్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. ఒక చిన్న కొండ ఎక్కి ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
Read Also..
Read Also..
కార్తీకమాసానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. కార్తీక స్నానం, కార్తీక దీపాలు, శివాభిషేకాలు, పూజలు అన్నీ మార్మోగిపోతాయి. శివాలయాలలో కార్తీక మాసం స్నానానికి పెట్టింది. పేరు సూర్యుడు తులారాశిలో ఉండే కార్తీకం లో ఆవు గిట్టలు దిగిన గుంట లోని నీటిలో కూడా శ్రీమహావిష్ణు ఉంటాడు అంటారు. మహావిష్ణువు అవతారమే తిరుమల తిరుపతిలో వెలసిన వేంకటేశ్వరుడు. ఈ విషయం అందరికీ తెలుసు. అటువంటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం చెప్పటానికి కూడా మాటలకు అందని అంత పుణ్యం వస్తుంది. శాస్త్రాల్లో ఉత్తమమైంది ఏదంటే వేదం. అలాగే సర్వదేవతల్లో ఉత్తముడు శ్రీహరి ! ఆయనే ఏడుకొండల మీద స్వామి శ్రీవేంకటేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. సకల తీర్థాల్లో పరమపావనమైన తీర్థం తిరుమలలో ఉన్న శ్రీ స్వామి వారి పుష్కరిణి. తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది పొందింది. ఆ దివ్య క్షేత్రములో నెలకొన్న కోనేరును స్వామి పుష్కరిణి అంటారు. అందుకే “కోన్+ఏరు”తమిళంలో “కోన్” అనగా దేవుడు “ఏరు” అనగా చెరువు అదే కోనేరు అందుకే శ్రీనివాసుని కోనేటి రాయుడు అని కూడా అంటారు. స్వామి పుష్కరిణి మనసారా స్మరిస్తే చాలు సకల పాపాలు తొలగిపోతాయి తిరుమల కొండమీది కోనేటిని కనులారా దర్శిస్తే చాలు మనసులో కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయి. స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే చాలు బ్రహ్మహత్య వంటి సకల పాతకాలు నశిస్తాయి. నరక భయం పోతుంది సంపదలు సిద్ధిస్తాయి సకల పాపాలు పోతాయి. తిరుమల మీద ఉన్న శ్రీ స్వామి పుష్కరిణి మహత్యాలు ఎన్నో, మహిమలు ఎన్నోన్నో ఆ కోనేటి గొప్పదనం ఇంతింతని చెప్పటం అసాధ్యం అవి అనంతం గొప్ప అద్భుతం కూడా. స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం, సద్గురువు పాదసేవ దొరకటం, ఏకాదశి వ్రతం ఆచరించటం అనే మూడు పవిత్ర కార్యాల్లో ఒక్కటంటే ఒక్కటైనా కలగటం ఎంతో అదృష్టం. అందులోనూ ఒకేసారి ఈ మూడు కార్యాలు సిద్ధించడం ఎంతటి అద్భుత భాగ్యమో చెప్పటం అసాధ్యం. అంతేకాదు కాదు మనిషిగా పుట్టడం మానవత్వంతో జీవించటం ఈ జన్మలోనే స్వామి పుష్కరిణిలో స్నానం చేసే భాగ్యం కలగడం ఈ మూడు అత్యంత దుర్లభములు అని చెబుతారు పురాణ పండితులు. ఈ మూడు పనులుగొప్ప పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే దక్కుతాయి. అందుకే తిరుమల క్షేత్రంలో ఉన్న పుష్కరినికి అంత ప్రత్యేకత వచ్చింది. ఆ పుష్కరిణిలో స్నానం చేయడం ఎంతో పవిత్రమని, అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ పుష్కరిణి స్నానం తప్పకుండా చేసి తీరతారు. అలాంటి గొప్ప పుష్కరిణిలో కార్తీక స్నానం చేయడం ఎనలేని పుణ్యఫలాన్ని ఇస్తుంది. అందుకే ఈ మాసంలో తిరుమలకు భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది.
Read Also..
Read Also..
కార్తీక మాసం ప్రాముఖ్యత :
కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసం శివుడు, విష్ణువులకు ప్రీతికరమైనది. కార్తీక మాసంలో శివుడిని, విష్ణువును పూజించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
కార్తీక మాసంలో జరిగే వ్రతాలు
కార్తీక మాసంలో అనేక వ్రతాలు జరుగుతాయి. ముఖ్యమైన వ్రతాలు.
కార్తీక శుద్ధ ఏకాదశి : ఈ రోజున భగవంతుడిని పూజించి, భగవద్గీత పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
కార్తీక పౌర్ణమి: ఈ రోజున శివుడిని పూజించి, రుద్రాభిషేకం చేస్తే సకల పాపాలు పోయి, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని శుక్రవారాలలో కుమార స్వామిని పూజిస్తే, శత్రుబాధలు తొలగిపోయి, విజయం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
కార్తీక మాసంలో చేసే ఇతర పనులు :
కార్తీక మాసంలో ఈ క్రింది పనులు చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు నదీస్నానం చేయడం శుభప్రదం. కార్తీక మాసంలో ప్రతిరోజూ శివుడిని, విష్ణువును పూజించడం ద్వారా పాపాలు తొలగిపోయి, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ భగవద్గీత పారాయణం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపాలు వెలిగించడం ద్వారా శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది.
కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు
కార్తీక మాసంలో ఈ క్రింది నియమాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు:
కార్తీక మాసంలో శాకాహారం తినడం శుభప్రదం.
కార్తీక మాసంలో మాంసం, మద్యం, పొగతాగడం వంటివి చేయకూడదు.
కార్తీక మాసంలో ఏకాంతంగా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది.
కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమ.
ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును , తరుణోపాయమును తెలుపమని’ అడుగగా, గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితాల గురించి పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు. ‘‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు.
పాదముల యందు – పితృదేవతలు కాళ్ళ యందు – సమస్త పర్వతములు భ్రూమధ్యమున – గంధర్వులు దంతముల యందు – గణపతి ముక్కున – శివుడు ముఖమున – జ్యేష్ఠాదేవి కళ్ళయందు – సూర్య, చంద్రాదులు చెవుల యందు – శంఖు చక్రములు కంఠమునందు – విష్ణుమూర్తి భుజమున – సరస్వతి రొమ్మున – నవ గ్రహములు వెన్నునందు – వరుణ దేవుడు , అగ్ని దేవుడు తోక యందు – చంద్రుడు చర్మమున – ప్రజాపతి రోమములయందు – త్రింశత్కోటి దేవతలు నివసించెదరు. అందువల్ల గోమాతను పూజించి పాపములను పోగొట్టుకొని ఆయురారోగ్యములను, అష్టశ్వైర్యములను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యము కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణము చేస్తే భూమండలము అంతా ప్రదక్షిణము చేసినంత ఫలము కలుగుతుంది. స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!! శ్రీ రామ రక్ష! సర్వ జగవూదక్ష !!’’ అని ముగించెను.
Read Also..
Read Also..





Total views : 149480