తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి వారికి స్వాగతం పలికారు. వీరికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రేవంత్ స్వయంగా పలువురు అగ్రనేతలను ఆహ్వానించారు. పక్క రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
political
మిచౌంగ్ తుఫాను కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షలు వరదలకు జన జీవనం వక్క సారిగా స్తంభించిపోయింది. కనీస నిత్యవసరాలు, కరెంటులేక, నీళ్లురాక ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, మంత్రి బాధితులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ… తుఫాను ప్రభావంతో అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు మేలు చేయాల్సింది మరిచి ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడటం సవాబ్ కాదు అన్నారు. మీకు చేతనైంది మీరు చేయండి అని ఆనందబాబుకు సవాళ్లు విసిరారు. మీ ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ అన్నారు. అదే మన ముఖ్యమంత్రి వ్యవసాయం పండగానే నినాదంతో ప్రతి రైతుకు సాయం అందిస్తారని విమర్శించారు.
Read Also…
Read Also…
కాంగ్రెస్శాసన సభాపక్ష నేత రేవంత్‌రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేతోపాటు వీవీఐపీలు పలువురు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తు చేస్తున్నారు. దీని కోసం మూడు వేల మందికి పైగా బలగాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే స్టేడియం లోపల, బయట మెటల్‌డిటెక్టర్లు, పోలీసు జాగిలాలతో తనిఖీలు పూర్తి చేశారు. నేడు మరోసారి తనిఖీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ఆంక్షలు విధించారు. ఇక, బుధవారం ఇన్ఛార్జ్డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్పోలీస్కమిషనర్సందీప్శాండిల్య, సెంట్రల్జోన్డీసీపీ శ్రీనివాస్తదితరులు స్టేడియాంకు వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
విశాఖ మిధిలాపురీ కాలనీలో యదేచ్చగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి. రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు. gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు. gvmc జోన్ 2 లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారు.. ఇంత జరుగుతున్న టౌన్ ప్లానింగ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. అక్రమ గ్రావెల్ తవ్వకాలతో సమీప భవనాలు కూలిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ACP శాస్త్రి కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా తవ్వకాలకు సహకరిస్తున్నాడు. ఈ తతంగంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుంతకల్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున వరుసగా ఆరు దుకాణాలలో గుర్తుతెలియని దుండగులు చోరీ చేయగా మరో మూడు దుకాణాలలో చోరీకి యత్నించారు. ఈ సందర్భంగా దుకాణాల యజమానులు మాట్లాడుతూ గత నెల 6 షాపుల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి రూ.10 వేలు నగదును ఎత్తుకెళ్లారన్నారు. అయితే మరోసారి సుమారు 6 దుకాణాలలో దుండగులు చోరీ చేసి రూ. 15,000 నగదును ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమానులు వెల్లడించారు. అయితే ఇప్పటికైనా పోలీసులు రాత్రి సమయాలలో గస్తీ తిరిగి చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని షాపు యజమానులు సంబంధిత పోలీసు అధికారులకు విన్నవించారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మజీ సీఎం, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తొలిసారి ప్రజలను కలిశారు. చింతమడక గ్రామానికి చెందిన ప్రజలు ఆయనను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు. బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు, ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సులు, 10 కార్లలో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే, వీరిని పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలకు అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు. దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది. అనంతరం కేసీఆర్ తో చింతమడక గ్రామస్తులు మాట్లాడి వెనుదిరిగారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్ప్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిని హామీ ఇచ్చారు. పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబులం పూజలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి. అయ్యప్ప మాలధారణం నియమాల తోరణమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ని వారి స్వగృహంలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబలం పూజలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. అంబులం పూజ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18 మెట్ల మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అయ్యప్ప మాలధారణ స్వాములు, గురుస్వాముల భక్తి పాటలతో ఈ ప్రాంతం పులకరించింది. పూజ అనంతరం సుదర్శన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భిక్ష ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష ఆరోగ్య రక్ష అని అన్నారు.చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్ష పరమార్థమన్నారు. ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై సంపూర్ణ ఆరోగ్యం క్రమశిక్షణతో కూడినజీవన విధానం , ధార్మిక భావాలు అలవడు తున్నాయన్నారు. కార్తీక మాసంచాలా విశిష్టమైనదని, నియోజకవర్గంలో కార్తీక మాస శోభ సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మాజీ ఎంపిపి అంపాబత్తిన రెడ్డెయ్య,వైస్ ఎంపిపి సుబ్బరాయుడు, సర్పంచులు వెంకట నారాయణరెడ్డి , జనార్దన్ రెడ్డి, ఎంపిటిసి లు లక్ష్మీ నారాయణ,జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




Total views : 54928