రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో క్రేన్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది కంపెనీ. మృతులకు ఒక్కో కుటుంబానికి 25 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది NCC కంపెనీ. మహాలింగాపురం గ్రామ పరిధిలో ఎన్సీసీ సంస్థ.. ఐరన్ షీట్లను తయారు చేస్తోంది. వాటిని క్రేన్ల ద్వారా వాహనాల్లో లోడు చేసి పంపిస్తోంది. ఈ క్రమంలో నిన్న భారీగా ఈదురు గాలులు, వర్షం కురుస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు మొత్తం 17 మంది షెడ్డులోకి వెళ్లారు. ఈదురు గాలులకు అక్కడే ఉన్న క్రేన్లు ఒకదానికొకటి ఢీకొని షెడ్డు మీద కుప్పకూలాయి. దీంతో లోపల ఉన్న కార్మికులు షెడ్డులో ఇరుక్కుపోయి హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను బయటకు తీసి శంకర్పల్లి, చేవెళ్ల ఆసుపత్రులకు తరలించారు. ఇందులో ముగ్గురు మధ్యలోనే చనిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన 13 మంది చికిత్స పొందుతున్నారు.
Tag:




Total views : 62337