శ్రీ రామనవమి (Sri Rama Navami) :
నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ రామనవమి (Sri Rama Navami) సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దేవస్థానానికి అనుబంధ అలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుండి శ్రీ సీతారామస్వామికి శ్రీ ప్రసన్నాంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించి పూజలనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
ఇది చదవండి : ఈ నెల 17న శ్రీరామనవమి తిరు కళ్యాణ మహోత్సవం
కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం ఫాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ, వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం, కంకణపూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీసీతాదేవికి మాంగల్య ధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానం అధికారులు, సిబ్బంది స్థానికులు భక్తులు తిలకించారు అనంతరం దేవస్థానం భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..
అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొందారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భజనల నడుమ… - భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి, సీతమ్మవారికి, లక్ష్మణస్వామికి ప్రత్యేక పూజలు చేశారు సీతక్క.… - రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం..
కేంద్ర ప్రభుత్వం ముద్రించిన దివ్యభారత్ పుస్తకంలో చోటు దక్కించుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం… ప్రతి రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఏటా రూ.25 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది .బ్యాంకుల్లో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు…








Total views : 89722