పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘మా-మాటి-మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మమతా బెనర్జీ ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.
ఎన్నికల ఫలితం ఇప్పటికే తమ పార్టీకి అనుకూలంగా ఉందన్నారు మమతా బెనర్జీ. కేంద్ర ప్రభుత్వం తన పూర్తి యంత్రాంగాన్ని రంగంలోకి దించినా.. విజయం మాత్రం టీఎంసీదే అని తేల్చి చెప్పారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైనా మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఎగ్జిట్ పోల్ గణాంకాలను బీజేపీ కార్యాలయం నుంచే విడుదల చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతల్లో భయాందోళనలు సృష్టించేందుకు బీజేపీ సంఖ్యలను తారుమారు చేసిందని మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో తన మద్దతుదారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేశారని ధ్వజమెత్తారు.
Tag:





Total views : 62137