Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News HICC వేదికగా తెలంగాణ ప్రగతి గళం..

HICC వేదికగా తెలంగాణ ప్రగతి గళం..

by CVR NEWS
HICC వేదికగా తెలంగాణ ప్రగతి గళం

హైదరాబాద్‌ మహానగరం మరో అద్భుత ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ లో పర్యటించారు. బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోడీ … అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఐసీసీలో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. ప్రధానికి రేవంత్ రెడ్డి వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9 వేల 377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం సుమారు 12 లక్షల కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు. 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, నేషనల్ హైవేల విస్తరణ మరియు మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించడం వంటివి కేంద్రం సాధించిన విజయాలని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రగతికి తాము కట్టుబడి ఉన్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రాన్ని 2047 నాటికి అగ్రగామిగా నిలబెట్టే ‘తెలంగాణ రైజింగ్-2047’ మాస్టర్ ప్లాన్ గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అభివృద్ధిలో తాము కేంద్రంతో కలిసి నడిచేందుకు సిద్ధమని స్పష్టం చేస్తూనే.. మెట్రో రైలు రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ మరియు మూసీ నది ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు కేంద్రం పెద్ద మనసుతో నిధులు అందించాలని కోరారు. ఒకవైపు పాతబస్తీ మెట్రో, మరోవైపు ఫ్యూచర్ సిటీ నిర్మాణం.. ఇవే తమ ప్రభుత్వ లక్ష్యాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: