Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Film ‘డెవిల్’ నుంచి రాజకుమారి పాడిన ‘దిస్ ఈజ్ లేడీ రోజ్…’ సాంగ్ రిలీజ్

‘డెవిల్’ నుంచి రాజకుమారి పాడిన ‘దిస్ ఈజ్ లేడీ రోజ్…’ సాంగ్ రిలీజ్

by Rama
devil movie

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. టైటిల్, ట్యాగ్ లైన్ చూస్తుంటే సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరుగుతుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నారు.

రీసెంట్‌గా రిలీజైన ‘డెవిల్’ మూవీ టీజర్‌, ‘మాయ చేశావే..’ సాంగ్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమా నుంచి ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ అనే లిరికల్ వీడియోను సెకండ్ సాంగ్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటను ‘జవాన్’ చిత్రంలో టైటిల్ ట్రాక్‌తో ఆకట్టుకున్న లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ రాజకుమారి పాడటం విశేషం. ఆమె ఎనర్జిటిక్ వాయిస్ పాటకు మరింత ఎట్రాక్షన్‌గా మారింది.

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహించిన డెవిల్ సినిమాలో ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యాన్ని అందించగా రాజకుమార్ ఆలపించారు. బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ ఈ పాటలో అప్పియరెన్స్, డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో నందమూరి కళ్యాణ్ రామ్ తెలుపు రంగు సూట్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ సాంగ్ థియేటర్స్‌లో ఆడియెన్స్‌కి కళ్లకు విందులా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

ఎన్నో మంచి చిత్రాను మనకు అందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోంది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. గాంధీ నడికుడికర్ ఈ సినిమాకు ప్రొడఓన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహించారు. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చ‌ర్స్

Advertisements

You may also like

Our Visitor

018679
Total views : 89157

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.