Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ..

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ..

by CVR NEWS

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ ఎన్నికైనట్టు తెలిపాయి అక్కడి వార్తాసంస్థలు. అయితే, ఇది నిజం కాదని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సుప్రీం లీడర్‌ ఖమేనీ రెండవ కుమారుడే మొజ్తాబా. ఆయన వయస్సు 56 ఏళ్లు. నిపుణుల అసెంబ్లీ నిన్న సమావేశమై.. కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ఎన్నుకున్నట్లుగా ప్రచారం జరిగింది. దేశంలోని శక్తిమంతమైన ‘ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌’ IRGC మద్దతు మొజ్తాబాకు ఉందని, ఈ నేపథ్యంలోనే ఆయనకు అత్యున్నత బాధ్యతలు అప్పగించినట్లు తెలిపాయి. అయితే, దీనిపై ఇరాన్‌ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. నిపుణుల అసెంబ్లీ ఒక నాయకుడిని ఎన్నుకుందన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది.

ఇదిలా ఉంటే..ఇరాన్‌ కొత్త నేతగా ఎవరిని ఎన్నుకున్నా వారిని అంతమొందిస్తామని వెల్లడించారు ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి కట్జ్‌. మొజ్తాబాను ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారన్న వార్తల నేపథ్యంలో ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఇజ్రాయెల్‌ వినాశనానికి ప్రణాళికలు అమలుపరిచేందుకు, అమెరికాను, స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని, పశ్చిమాసియాలోని ఇతర దేశాలను బెదిరించేందుకు, ఇరాన్‌ ప్రజల్ని అణచివేసేందుకు ఇరాన్‌ ఉగ్రరాజ్యం ఏ నాయకుడిని నియమించినా అంతమొందిస్తామని తెలిపారు. ఆ నాయకుడు ఎవరైనా, ఎక్కడా దాక్కున్నా సరే వదిలేదిలేదని..ఈ మేరకు సైన్యానికి ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు కట్జ్‌.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: