Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

by CVR NEWS

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల వాగ్దానం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులతో కలసి సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి సీఎం నిర్ణయం తీసుకున్నారు. తొలివిడతగా ఒక ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. దీని కోసం రూ.3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2,650కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏప్రిల్‌ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ.9 వేల కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Advertisements

You may also like

Our Visitor

018665
Total views : 89129

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.