Thursday, October 1, 2026
News Navigation
Thursday, October 1, 2026
News Navigation

Breaking

Thursday, October 1, 2026
Home Business విజయవాడ బస్సు ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

విజయవాడ బస్సు ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

by Prakash
cm jagan Rs 10 Lakh ex-gratia to families of victims

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని…గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. ఇకపోతే విజయవాడలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రూ బస్టాండ్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కండక్టర్, ఓ మహిళా, మరో చిన్నారి కూడా మృతి చెందారు. ప్లాట్ ఫామ్ 12 దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిలై ఫ్టాట్ ఫాం పైకి దూసుకెళ్లిన దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. డ్రైవర్ రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: