విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఆర్టీసీ బస్సు బీభత్సంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్లో చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని…గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. ఇకపోతే విజయవాడలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రూ బస్టాండ్లో బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కండక్టర్, ఓ మహిళా, మరో చిన్నారి కూడా మృతి చెందారు. ప్లాట్ ఫామ్ 12 దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిలై ఫ్టాట్ ఫాం పైకి దూసుకెళ్లిన దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. డ్రైవర్ రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.
bus accident at vijayawada
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దీంతో పది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్టాండ్ లోని పన్నెండో నెంబర్ ప్లాట్ ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ, చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులకు గాయాలయినట్లు సమాచారం.
విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్లాల్సి ఉండగా.. ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చే క్రమంలో బ్రేకులు ఫెయిలయ్యాయి. రివర్స్ గేర్ బదులుగా డ్రైవర్ ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు ప్లాట్ ఫాంపై ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి వెళ్లింది. దీంతో బస్సు చక్రాల కింద నలిగి ముగ్గురు చనిపోయారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెల్లడించారు. కాగా, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.