Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News అమెరికాలో సైబర్ దాడుల కలకలం..

అమెరికాలో సైబర్ దాడుల కలకలం..

by Rama
Cyber attacks on hospitals

అమెరికాలో పలు ఆసుపత్రులు ఒకేసారి సైబర్ దాడి బారినపడటం కలకలం రేపుతోంది. న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహోమా రాష్ట్రాల్లోని 20కి పైగా ఆసుపత్రుల్లో ఆర్డెంట్ హెల్త్ సర్వీసెస్ సంస్థ వైద్య సేవలు, ఇతర సదుపాయాలు అందిస్తోంది. అయితే, సైబర్ నేరగాళ్లు సంస్థకు చెందిన మెడికల్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయడంతో ఆయా ఆసుపత్రుల్లోని వైద్య సేవలు నిలిచిపోయాయి. కాగా, ఘటనపై స్పందించిన ఆర్డెంట్ హెల్త్ సర్వీసెస్‌ సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ఎమర్జెన్సీ గదుల్లోని రోగులను ముందుజాగ్రత్తగా ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొంది. ఇతర రోగులకు శస్త్రచికిత్సలు వాయిదా వేసినట్టు తెలిపింది. సాధారణ వైద్య సేవలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక సైబర్ దాడిలో ఎలాంటి సమాచారం లీక్ అయ్యిందో ఇప్పుడే చెప్పడం కష్టమని ఆర్డెంట్ సంస్థ వెల్లడించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: