Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Film ‘ల్యాండ్ మాఫియా’ ట్రైలర్ విడుదల

‘ల్యాండ్ మాఫియా’ ట్రైలర్ విడుదల

by Rama
Land Mafia Movie

ప్రణయనాథ చిత్రాలయ బ్యానర్ మీద ప్రణయనాథ, మధుబాల హీరో హీరోయిన్ గా వస్తున్న చిత్రం ‘ల్యాండ్ మాఫియా’. ఈ చిత్రానికి బాబు వీఎన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ట్రైలర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ

హీరో, నిర్మాత ప్రణయ నాథ మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రంగా మొదలైన ఈ ప్రాజెక్టు పెద్ద సినిమా గా మారింది. మొదటి నుంచి మాకు శ్రావ్య ఫిల్మ్స్ అండగా నిలబడింది. అన్ని విధాలుగా మాకు సహకరించారు. ఓ మంచి చిత్రాన్ని తీశాం. త్వరలోనే మా ల్యాండ్ మాఫియా చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు

మధుబాల మాట్లాడుతూ.. ‘ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా సినిమా ఇప్పుడు ఇక్కడ వరకు రావడం నాకు ఆనందంగా ఉంది. సందేశాత్మక చిత్రం తో పాటు అన్ని రకాల కమర్షియల్ అంశాలుంటాయి. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ బాబు మాట్లాడుతూ.. ‘మా నిర్మాత ప్రణయనాథ ఎంతో సహకరించారు. ఖర్చుకి ఎక్కడా వెనకడుగు వేయలేదు. సునీల్ కుమార్ రెడ్డి గారి సహకారం వల్లే సినిమాను పూర్తి చేశాం. సినిమా టీం అంతా కూడా ఎంతో సహకరించారు. డీఓపీ వెంకట్ గారు, ఎడిటర్ కృష్ణ గారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. వారంతా ముందుండి మమ్మల్ని నడిపించారు. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఎడిటర్ కృష్ణ మండల మాట్లాడుతూ.. ‘చిన్నగా మొదలైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఇంత పెద్ద సినిమా గా మారింది. దీని వెనుక ప్రణయనాథ ప్యాషన్ ఉంది. సునీల్ కుమార్ రెడ్డి గారు వెన్నంటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేశారు. టీం అంతా కలిసి ఎంతో కష్టపడి చేసిన సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డీఓపీ వెంకట్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

సునీల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ‘నా ఫ్రెండ్ ఎక్కాలి రవీంద్ర బాబు వల్ల ఈ టీంను కలిశాను. నా ఫ్రెండ్ రవీంద్ర చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుండి నడిపించాను. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని, చిత్రయూనిట్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాన్ని ఆదరిస్తారు. ఈ ల్యాండ్ మాఫియా చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు చూసి మంచి విజయవంతం చేస్తారు అని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు

బ్యానర్ : ప్రణయనాథ చిత్రాలయ

చిత్రం పేరు : ల్యాండ్ మాఫియా

నిర్మాత : ప్రణయనాథ
దర్శకత్వం : బాబు వి ఎన్
కెమెరా మాన్ : వెంకట్ జె
ఎడిటర్: కృష్ణ మండల
సంగీతం : ప్రదీప్ చంద్ర
పి ఆర్ ఓ : పాల్ పవన్

నటీ నటులు :

ప్రణయనాథ
లక్ష్మి మధుబాల
హిమ బిందు
అప్పారావు (జబర్దస్త్)
కట్టా వెంకటేశ్వర్లు
శ్రీ కంఠం రవికుమార్
శిరీష
నూతన్ రావు
అహ్మద్ (జూనియర్ పప్పు)

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: