Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Film ఆసక్తికరంగా “మెర్సి కిల్లింగ్” ట్రైలర్ , ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదల !!!

ఆసక్తికరంగా “మెర్సి కిల్లింగ్” ట్రైలర్ , ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదల !!!

by Rama
Mercy Killing

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన సినిమా “మెర్సి కిల్లింగ్ (Mercy Killing)” సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందిస్తుండగా ఎం.ఎల్.రాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, సాంగ్స్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు.

“ప్రతి భారతీయుడు గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి… ఐ వాంట్ మెర్సీ కిల్లింగ్” అంటూ స్వేచ్ఛ అనే అమ్మాయి చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. అలాగే సాయి కుమార్ చెప్పిన “చంపితేనే పరువు ఉంటుంది అంటే ఏమైనా చేస్తాను” డైలాగ్ ఆలోచింపజేస్తుంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది.

నటీనటులు:
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్
డైరెక్టర్: వెంకటరమణ ఎస్
నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల
సమర్పణ: శ్రీమతి వేదుల బాల కామేశ్వరి
సినిమాటోగ్రఫీ: అమర్.జి
సంగీతం: ఎం.ఎల్.రాజ
ఎడిటర్: కపిల్ బల్ల
ఆర్ట్: నాయుడు
మాటలు: వై. సురేష్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పృథ్వి కడియం
లైన్ ప్రొడ్యూసర్: బాబీ శివకోటి

ఇది చదవండి:


‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి …
దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..
దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను హీరో రాకింగ్ …
ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..
ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019099
Total views : 89905

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.