ఇవాళ టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఎన్‌టీఆర్ విగ్రహ ఏర్పాటుపై రేవంత్ హామీ ఇచ్చారు. ఎన్‌టీఆర్ అభిమానుల చిరకాల కోరికను తాను నెరవేరుస్తానని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్..13 అడుగుల ఎన్‌టీఆర్ కాంస్య విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారుచేయించారు.
విగ్రహావిష్కరణ, బహిరంగ సభ నేపథ్యంలో మైత్రీవనం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల వరకు మైత్రీవనం జంక్షన్‌లో ఆంక్షలుంటాయని తెలిపారు. అమీర్‌పేట్, సత్యం థియేటర్, ఎస్‌ఆర్‌నగర్, సారథీ స్టూడియోస్ వైపు నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ వైపునకు వచ్చే వాహనాలను వెంగళరావునగర్, కళ్యాణ్‌నగర్, కృష్ణకాంత్ పార్క్ వైపునకు పంపుతారు. 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సత్యం ధియేటర్ వైపు నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ వైపునకు వెళ్లే వాహనాలను పంజాగుట్ట మీదుగా చెక్‌పోస్ట్ వైపునకు పంపుతారు. యూస్‌ఫగూడ నుంచి మైత్రీవనం వైపునకు వచ్చే వాహనాలను కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్‌నగర్ వైపునకు మళ్లించారు. యూస్‌ఫగూడ బస్తీ వైపు నుంచి అమీర్‌పేట్‌కు వచ్చే వాహనాలను అల్‌సభా హోటల్ నుంచి వెంగళ్‌రావ్‌నగర్ వైపునకు పంపుతారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.





Total views : 89030